Saturday, 14 November 2026

హైదరాబాద్

సీ బ్లాక్‌ వద్దకు దూసుకు వచ్చిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్‌: విజయవాడలో రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆరుగురు కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సమతా భవనం వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం పలువురు సచివాలయం సీ…

రేపటినుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంసెట్‌ అడ్మిషన్ల చివరి విడత కౌన్సెలింగ్‌ రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది. చివరివిడత కౌన్సెలింగ్‌కు హాజరయిన అభ్యర్థులకు అక్టోబరు 2 సాయంత్రం ఆరుగంటలకు సీట్లను కేటాయిస్తారు. మొదటివిడత…

సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెరాసా కార్యకర్తలు, తెలంగాణా వాదుల అక్రమ అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వమే రాజకీయాలకు పాల్పడటం అమానుషమన్నారు.

ముస్లింలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముస్లిం మతపెద్దలు, మేధావులతో సమావేశమయ్యారు. పార్టీలో వారి భాగస్వామ్యం పెంచేందుకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చలు జరిపారు. రాజకీయల్లో ముస్లింలకు రిజర్వేషన్లు, వక్ఫ్‌భూముల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయబద్ధమైన…

ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపూ కేసు పెట్టాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపై రాజద్రోహం కేసు పెట్టాలని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తమ వీరత్వాన్ని సోనియా వద్ద ఢిల్లీలోనూ ప్రదర్శించాలే కానీ సీమాంధ్ర ప్రజలపై కాదని…

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతాం: కోదండరాం

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకుకుని ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ నేతల అరెస్టులను ప్రభుత్వం వెంటనే…

తెలంగాణా సమస్య అత్యంత క్షిష్టమైంది: ఆజాద్‌

శ్రీనగర్‌: తెలంగాణ సమస్య అత్యంత క్లిష్టమైందని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 40,50 ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు విఫలమవుతున్నాయి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్చటానికి ప్రయత్నిస్తున్నాం . మూడు ప్రాంతాల ఆమోదం లభించే వరకు…

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: జానారెడ్డి

హైదరాబాద్‌: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించినట్లు సీనియర్‌ మంత్రి జానారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్యా స్థానిక సంస్థలకు నిధులు అపవద్దని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన …

బస్సును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి

బీహార్‌: సివాస్‌ జిల్లా చప్థాలాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. రైలు బస్సును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

‘తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడాల్సింది ప్రభుత్వమే’

నల్గొండ: తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణ జర్నిలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విడిపోవడం ద్వారా ఐక్యంగా…