Friday, 13 November 2026

హైదరాబాద్

సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లంతు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాపాల తిప్ప నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లతైనట్లు సమాచారం. ఉదయం తెప్పలో వేటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదని బంధువులు ఆర్డీవోకు సమాచారం అందించారు. గల్లంతైన వారిలో…

నగరంలో ఎడతెరపి వర్షాల నేపథ్యంలో మేయర్‌ సమీక్ష

హైదరాబాద్‌: జంటనగరాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా నాలలు పోంగుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనిపై నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ అధికుదులతో సమీక్ష నిర్వహించారు. ఐదుజోన్లలో…

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట ఖారరు

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఖరరైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొంటారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, నందికోట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.

సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా ఈ నెల 5 నుంచి 9 వరకూ సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. జాతీయ బాస్యెట్‌బాల్‌ సంఘంతో పాటు రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ సంఘం…

దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ

హైదరాబాద్‌: దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌ఛార్జి డీజీపీ హోదాలోనే ఆయనకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోసారి న్యాయస్థానానికి చేరిన ఫీజుల అంశం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఫీజుల అంశం మరోమారు న్యాయస్థానానికి చేరింది. అఫిడవిట్లు దాఖలు చేయకున్నా తమకు 27వేల ఫీజుల ఖరారుపై 10 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఏకీకృత కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.…

గాలి బెయిల్‌ విషయంలో వాదనలు పూర్తి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో సోమశేఖర్‌రెడ్డి, యాదగిరి బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే న్యాయస్థానం నిర్ణయాన్ని ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

హత్యాయత్నం కేసులో జైలుకళ్లిన అసలు దోషి బదులు, మరో వ్యక్తి

కర్నూలు: హత్యాయత్నం కేసులో 2004లో ఉరుకుందు అనే వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. అయితే ఉరుకుందుకు బదులుగా రంగస్వామి అనే వ్యక్తి జైలుకెళ్లాడు. జైలులో ఉండాల్సిన ఉరుకుందును చిలకల డోనులో ఫిర్యాదు దారు హనుమంతు గుర్తించడంతో విషయం బయటపడింది.…

నకిలీనోట్లు తరలిస్తున్న 7గురి అరెస్ట్‌

నల్గొండ: జిల్లాలోని కోదాడ వద్ద నకిలీనోట్లు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్స్‌ వద్ద వహనాలు తనిఖీ చేస్తుడగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వాహనాలను తనిఖీ చేయగా 1.90 లక్షల దొగనోట్లు…

రాష్ట్రాంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని వికేంద్రీకరిస్తాం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది తొలిసారిగా ధాన్యం కొనుగోళ్ల విధనాన్ని వికేంద్రీకరించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు వరిసాగు అధికంగా ఉన్న 15 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు,…