నగరంలో ఎడతెరపి వర్షాల నేపథ్యంలో మేయర్ సమీక్ష
హైదరాబాద్: జంటనగరాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా నాలలు పోంగుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనిపై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ అధికుదులతో సమీక్ష నిర్వహించారు. ఐదుజోన్లలో ఉన్న డిప్యూటీ కమిషనర్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా వ్వవహరించాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న కాలనీల్లో జనాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని మేయర్ కోరారు.