Friday, 13 November 2026

హైదరాబాద్

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాదులు దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి పిస్తోలు, 16 బెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత…

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాస్‌: ఇరాన్‌లో తూర్పు ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. క్వేస్‌ పట్టణానికి సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలియజేశారు. గత నెలలో ఇరాన్‌లో చోటుచేసుకున్న జంట భూకంపాల ఘటనలో…

చెప్యాలలో డెంగ్యూతో బాలుడు మృతి

మెదక్‌: మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెప్యాల గ్రామంలో తలారి కృష్ణ(9) అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందినాడు. 4రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.

నవాపేటలో మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

యలమంచిలి, విశాఖపట్నం: ధన్‌బాద్‌నుంచి అలెప్పీ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో మంటలు రావడంతో ఈ రైలును  యలమంచిలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. స్థానికులు సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు  సంభవించలేదని సిబ్బంది. తెలియజేశారు.…

వావిలాలపల్లిలో బాలిక అపహరణ

కరీంనగర్‌: వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో…

త్వరలోనే శాసనసభా సమావేశాలు: గండ్ర

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమరెడ్డి అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. విద్యుత్‌ సమస్యను విపక్షలు రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు.

వైఎస్‌కు నివాళులు అర్పించిన సీఎం, బొత్స

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మూడో వర్థంతి సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి వూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు…

నేడు హస్తినకు బొత్స

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ సత్యనారాయణ ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన ప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం ఎంపీకకై చేసే కసరత్తు గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో  చర్చించనున్నట్టు సమాచారం . అదివారం గాంధీ భవన్‌లో జరిగే వైఎస్‌ఆర్‌ వర్దంతి…

లింక్‌ తెగి నిలిచిన గూడ్స్‌ రైలు

విజయనగరం: లింక్‌ తెగడంతో గూడ్స్‌రైలు నిలిచిపోయిన  ఘటన కొమరాడ మండలం సోమిదవలన వద్ద చోటుచేసుకుంది. రాయగఢ్‌ నుంచి వస్తోన్న  ఓగూడ్స్‌ రైలు లింక్‌ తెగిపోవడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో పయనించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర…