Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో విద్యుత్‌ పునరుద్దరణ

ఢిల్లీ: ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. ఐదు ప్రాంతాల్లోనూ నూరు శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్దరించినట్లు ప్రధాన పంపిణీ సంస్థ ప్రకటించింది. సోమవారం అర్థరాత్రి ఉత్తరాది గ్రిడ్‌ వైఫల్యంతో మొదలైన విద్యుత్‌…

అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు భూములు అప్పగించాలన్నారు. వాన్‌పిక్‌ భూముల్ని ఆయన ట్రాక్టర్లతోదున్నారు.

జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.

కరువు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన కేంద్ర మంత్రులు

ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌లు కరువు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటనకు గాను ఈరోజు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ముంబాయిలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌తో భేటీ కానున్న…

షిండే, మొయిలీలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

ఢిల్లీ: నూతన శాఖల బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీలను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం కలిశారు. మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, సురేశ్‌ షెట్కార్‌లు తెలపారు.

రెండో రోజూ కొనసాగుతున్న ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన

నెల్లూరు: అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగుతోంది. పూర్తిగా దగ్ధమైన ఎన్‌-11బోగి నుంచి పలు కీలక ఆధారాలను ఫోరెన్సిక్‌ నిపుణులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ముగ్గురు విద్యార్థినుల ఆదృశ్యం

హైదరాబాద్‌: అంబర్‌పేటలో అర్చన, నిఖిత, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. గత రెండు రోజులుగా వీరు కనపడకపోవడంతో వారి తల్లిదండ్రులు నిన్న రాత్రి అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విద్యార్థినుల సైకిళ్లు, బ్యాగ్‌లు ఓయూ…

రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంతా త్వరగా మళ్లీ విద్యుదుత్పత్తిని పున:ప్రారంభిస్తామని వారు తెలిపారు.

కృష్ణా డెల్టాకునీరిచ్చేదాకా పోరాటం ఆగదు: చంద్రబాబు

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేవరకు తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరిలో పర్యటించేందుకు గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దస్త్రాలను స్పీకర్‌ ఎదుటు ఉంచాలని ప్రభుత్వాన్ని…

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత పార్టీ యంత్రాంగంతో కొద్ది సేపు…