Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడి నిష్క్రమించింది. టెన్నిస్‌ డబుల్స్‌ రెండో రౌడ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జోడీ జూలియస్‌ బెనెటౌ, రిచర్డ్‌ గాస్కెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది.

సికింద్రాబాద్‌లో కూలిన రెస్టారెంట్‌ పైకప్ప

సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌ సమీపంలో ఉన్న ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ పైకప్పు ఈరోజు రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల సరీస్‌ను భారత్‌ కైవశం చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగోవన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదువన్డేల సరీస్‌లో భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. 252 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు…

ఉత్తరాది గ్రిడ్‌ పాక్షికంగా పునరుద్దరణ

న్యూఢిల్లీ: కుప్పకూఐలిన ఉత్తర, తూర్పు విద్యుత్‌ గ్రిడ్‌లను అధికారయంత్రాంగం పాక్షికంగా పునరుద్దరించినట్టు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఉత్తరాది గ్రిడ్‌లో 44శాతం తూర్పు గ్రిడ్‌లో 35శాతం విద్యుత్‌ పంపిణీ పునరుద్దరణ జరిగిందన్నారు. రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా కంటే…

సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలను ప్రజల్లోకితీసుకెళ్లేందుకు యువజన…

కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం

ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. సాగునీటి పంపుల కోసం రైతులకు డీజిల్‌పై 50శాతం రాయితీ…

మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ విలేకరుల…

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ జనార్థన్‌ బృందానికి దొరికిపోయాడు. అతన్ని బుధవారం…

92పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: రిజర్వ్‌బ్యాంక్‌ పరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంతర్జాతీయంగా అనుకూల ఫలితాలతో మంగళవారం స్టాక్‌మార్కెట్‌ లాభాలనార్జించింది. సెన్సెక్స్‌ 92.50పాయింట్ల ఆధిక్యంతో 17236.18వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 29.20పాయింట్ల లాభంతో 5229 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు గ్యాస్‌, ఐటీ…

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీ స్థానంలో ఇప్పటి వరకు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి.చిదంబరంకు ఆర్థికశాఖ అప్పగించారు. చిదంబరంలో స్థానంలో హోం శాఖను సుశీల్‌కుమార్‌ షిండేకే కేటాయించారు.…