Monday, 9 November 2026

హైదరాబాద్

బీహర్‌లో బస్సు ప్రమాదం

బీహర్‌:నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 30మందికి పైగా మృతి చెందారు.మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులను ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారున వీరంతా బస్సులో వాల్మీకీనగర్‌ సమీపంలోని త్రివేణి సంగమంకు వెళ్తున్నారు.సహాయక చర్యలు చేపట్టారు.

చంపుతామనడం మాప్రాంతంలో సాధారణమే:టీజీ

హైదరాబాద్‌:ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదస్పర వ్యాఖ్యలపై మంత్రి టీజీ వెంకట్‌శ్‌ వివరణ ఇచ్చుకున్నారు.చంపుతామనడం మా ప్రాంతంలో సాదారణవేనని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై అదిరారులు పట్టించుకోకపోవడంతో తాను ఆ మాట అనాల్సివచ్చిందని తెలిపారు.రైతులు తాము ఆత్మహత్యలు చేసుకుంటామని అనడంతో మీరెందుకు…

రైతులపై కెసులు పెట్టవద్దు:సీఎం

తూర్పుగోదావరి:రైతులు తీసుకున్న పంటరుణాలపై వడ్డీ మాఫీ చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన మాట్టాడుతూ రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని ప్రకటించారు.ఈ విషయంలో రైతులు పై కేసులు పెట్టాల్సిన అవసరం లేదని…

భారత్‌ కఠినమైన ఆర్ధిక సంస్కరణలు అమలుచేయాలి:ఒబామా

వాషింగ్టన్‌:రిటైల్‌లాంటి చాలా రంగాల్లో భారత్‌ విదేశీ పెట్టబడులను నిరోదించిన నేపథ్యంలో కఠినమైన ఆర్థిక సంస్కరణలు అమలుచేయకతప్పదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వృద్దిరేటును ప్రశంసిస్తూనే పెట్టుబడుల వాతావరణం క్షీణిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.జమ్మూకాశ్మీర్‌…

విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఢిల్లీలో విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం నెల 17న జరుగుతుందని మంత్రి పొన్నాలలక్ష్మయ్య తెలిపారు.రాష్ట్రానికి అదనపు గ్యాస్‌,విద్యుత్తు ఇవ్వాల్సిందిగా అక్కడి సమావేశంలో కేంద్రాన్ని కోరతామని మంత్రి చెప్పారు.

రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే అన్నాను:టీజీ

హైదరాబాద్‌:రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే తాను అన్నానని మంత్రి టీజీ వెంకటేష్‌ వివరణ ఇచ్చారు.ఆయనిక్కడ మాట్లాడుతూ కొందరు.ఐఏఎస్‌ అధికారుల వ్వవహర శైలిలో విసిగిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.రైతులు తన వద్ద ప్రభుత్వ పని తీనుపై ఆవేదన వ్యక్తం చేశారని…

చేనేతకార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

అమలాపురం:జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బండారులంక అమలాపురం,బట్నవల్లి ప్రాంతాల్లో పర్యటించారు.బండారులంకలో చేనేతకార్మికుల కుటుంబాలను పరామర్శించి,స్థానిక పరిస్థితులను చేనేత కార్మికును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ బాట కార్యక్రమంలో బాగంగా బండారు లంకలో ఏర్పాటుచేసిన చేనేత కార్మికులతో ముఖాముఖి…

మహబూబ్‌నగర్‌లో రూ.260 కోట్లతో నమూనా పాఠశాలలు

బాలానగర్‌:మాద్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారది మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ పర్యటించారు.ఈ సందర్భంగా మండలం కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రూ.260 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.ఈ పాఠశాలల్లో విద్యాభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటామిని వివరించారు.ఉచిత విద్యతోపాటు క్రీడలు కంప్యూటర్‌…

తూర్పు నౌకాదళంలో ఉద్యోగి ఆత్మహత్య

విశాఖపట్నం:తూర్పు నౌకదళనికి చెందిన ఒక ఉద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు.ఐఎస్‌ఎస్‌ పుత్రి నౌకలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రోహిత్‌కుమార్‌ సొంత రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడు రోహిత్‌కుమార్‌ స్వస్థలం డెహ్రాడూన్‌ మృత దేహన్ని ఐఎస్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం పంపించారు.

ఘనంగా నమ్‌ ఉరత సింతనాయి స్వచ్ఛంద సంస్థ 11వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:తమిళనాడుకు చెందిన నమ్‌ ఉరత సింతనాయి స్వచ్చంద సంస్థ 11వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్విహించారు.రవీంద్రభారతి మినీ హాలులో జరిగిన ఈ కార్యక్రమానకి కళాకారులు,సినీ ప్రముఖులు హజరయ్యారు.సమాజంలో మంచితనం,ఉన్నత ఆలోచనలు,మానవత్వం ఉన్న వారిని గుర్తించిన సంస్థ ప్రతినిదులు ఇక్కడి…