జిల్లా కేంద్రంలో భారీ వర్షం
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్, చంద్రశేఖర్ కాలనీ, రాజీవ్‌నగర్ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్, చంద్రశేఖర్ కాలనీ, రాజీవ్‌నగర్ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.
నిజామాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే ముఖ్యమంత్రి మాత్రం తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని…
నిజామాబాద్: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. భారీ వర్షాలకు ఆవులు మృతి చెందిన బాధితులకు ప్రభుత్వ…
నిజామాబాద్: మంద కల్లుపై టీఆర్ఎస్ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ధర్నాలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు.
నిజామాబాద్: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.
నిజామాబాద్: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1063.20 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
నిజామాబాద్: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో రెండు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మారుతి(26) శవమై తేలాడు. పోస్టమార్టం కోసం బాల్కొండకు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్: ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రమాద స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటుచేశారు.
నిజామాబాద్: మద్దూరు మండలంలోని అండేకేలూర్,చిన్నశక్కర్‌దా,బోజేగాం, తడి ఇప్పర్‌దా,రూసేగాం,లుంబూర్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ, అంగన్వాడి వైద్యసిబ్బంది గ్రామ కార్యదర్శులు పారిశుద్యం, తాగునీటి సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు సూజాత ఉన్నారు.