Wednesday, 11 November 2026

వరంగల్

కోల్‌ఫిల్లర్‌పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి

భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్‌ఫిల్లర్‌పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్‌ నిర్వమించారు.

వరంగల్‌ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

వరంగల్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌

వరంగల్‌: భారీ వర్షాల కారణంగా గుండ్రాతి మడుగు-గార్ల స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఈ మార్గంలో 50 స్లీవర్ల మేరు కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను దారి…

వాగులో చిక్కుకున్న కారు

వరంగల్‌: భారీ వర్షానికి ఆత్మకూరు మండలం సింగారంలో వాగు ఉధ్దృంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో కారు చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులన్నట్లు సమాచారం. స్థానికులు తాడు సహాయంతో కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నింస్తున్నారు.

బస్సులు సకాలంలో నడపాలని ధర్నా

మంగపేట: కళాశాల, పాఠశాలల విద్యార్థుత కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవటంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు.

వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వర్షాల కారణంగా గ్రామంలో విద్యుత్‌ తీగలు తెగికిందపడ్డాయి. సోమవారం ఉదయం తీగలపై…

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగలేదు, ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ మూడు  రోజుల పసికందు సోమవారం ఉదయం మృతి చెందింది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.