Monday, 23 November 2026

సీమాంధ్ర

బంగాళాశాతంలో అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని విశాకలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణాంధ్ర, రాయసీమల్లో వర్షలు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. గడిచిన…

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

పెనుగొండ : అనంతపురం జిల్లాలోని పెనుగొండ సమీపంలోని దొడ్డికుంట ప్రధాన రహ దారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం వేణుగోపాల్‌ నగర్‌కు చెందిన బాబా ఫక్రుద్దీన్‌ కుటుంబీకులు…

తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి

తిరుపతి : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతి చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు.

మురుగు గుంతలో పసికందు మృతదేహాలు

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలోని మురుగు గుంతలో ఏడు పసికందు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తూగో జిల్లాలో అగ్నిప్రమాదం : పది ఇళ్లు దగ్థం

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం జీఎంపేట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. గ్రామానికి చెందిన నేమాల సత్యనారాయణ ఇంటి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు సమీప ఇళ్లను చుట్టేశాయి, దాదాపు పది ఇళ్లు ఈ…

గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్‌ కమలా బేనివాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అద్వానీ, గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జెట్లీ,…

విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థుల మృతి

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ వద్ద  విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. వీరంతా మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని వికాస్‌ ఎక్స్‌లెంట్‌…

నర్సరావు పేటలో నేడు బంద్‌ నేటి రాత్రి వరకూ 144 సెక్షన్‌ అమలు

నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తెలుగుదేశం  పార్టీ ఆధ్వర్యంలో నేడు బంద్‌ పాటిస్తున్నారు. ఈమేరకు స్వఛ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీ, కోడెల అరెస్ట్‌ నేపథ్యంలో బుధవారం బంద్‌ నిర్వహించాలని…

అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం

కృష్ణా : ముదినేపల్లి మండలం కాట్రవాడలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో జయలక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడ్ని గుడివాడ ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన

కృష్ణా: కృష్ణా జిల్లా మునుసూరు విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డి.ఇ ఏఈ సహా 12 మంది విద్యుత్‌ సరఫరా చేయాలని…