Monday, 23 November 2026

సీమాంధ్ర

ఇద్దరు వీఆర్‌వోల సస్పెన్షన్‌

కృష్ణా : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలానికి చెందిన ఇద్దరు వీఆర్‌వోలు సత్యంబాబు, హసీనాబేగంలను అధికారులు సస్పెండ్‌ చేశారు. సహకార ఎన్నికల ఓటరు నమోదులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారని వారిని సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

విశాఖ: విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీ నుంచి 200 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి

తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తారు.

రేపు కూడా నరసరావుపేటలో 144 సెక్షన్‌

గుంటూరు : గుంటూరు జిల్లా నర్సరావు పేటలో రేపు కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. 144 సెక్షన్‌ దృష్ట్యా బంద్‌ పాటించవద్దని…

బాలికపై ఉన్మాది దాడి : పరిస్థితి విషమం

గుంటూరు : పదేళ్ల బాలికపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. గుంటూరు. జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక రత్నమాణిక్యాన్ని ఉన్మాది మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాలిక పరిస్థితి విషమించడంతో…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని బెలుగప్ప మండలం ఎన్‌. గుండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ఐషర్‌ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో…

కేఎన్‌ఆర్టీసీ బస్సు బోల్తా : మహిళ మృతి

కర్నూలు : డోన్‌ మండలం కొత్తకోట గిడ్యా మిట్ట వద్ద మంగళవారం ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులును సమీప ఆసుపత్రికి తరలించారు.

అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రకాశం : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహిళలమీద అత్యాచారాలను ఖండిస్తూ ప్రకాశంలో జరిగిన భారీ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి…

డీఈఓ కార్యాలయ ముట్టడి

నెల్లూరు : డీ.ఇ.ఒ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు డి.ఇ.ఒ. కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

కోడెలపై లాఠీఛార్జీ అమానుషం

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌పై పోలీసులు లాఠీఛార్జీ అమానుషమని దాడి వీరభద్రరావు, కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు అరండల్‌పేట కూడళ్లలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో కొనసాగుతొంది. ఈ ఆందోళనలో తెదేపా నేతలు దాడి వీరభద్రరావు,…