Wednesday, 25 November 2026

వార్తలు

భారీ వర్షాల వల్ల పొంగి ప్రవహిస్తున్న భగీరథి నది

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో ఉత్తరకాశీ వద్ద భగీరథి నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోంది. మరోవైపు నేడు కూడా కేదార్‌నాథ్‌లో వరద మృతులకు అంత్యక్రియలు కొనసాగనున్నాయి.

నేటితో ముగియునున్న చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. చార్‌ధావమ్‌ యాత్రికుల తరలింపు ప్రక్రియ శనివారంతో ముగియనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 1400 మంది యాత్రికులను నేడు సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.

భార్యను నరికి చంపిన భర్త

ఖమ్మం: కుటుంబకలహాల నేపథ్యంలో భర్త నరికి చంపిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ22 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట, నెల్లూరు: పీఎస్‌ఎల్‌వీ-సీ22 వాహక నౌక ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం 64.30 గంటలు నిరంత రాయంగా కొనసాగనుంది. జులై 1 రాత్రి 11 గంటల 41 నిమిషాలకు పీఎస్‌ ఎల్‌వీ-సీ22…

మామిడి తోటను ధ్వంసం చేసిన ఎనుగులు

సుండుపల్లి : కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ముడుంపాడు పంచాయతీ గోపాలకృష్ణాపురం గ్రామంలో ఏనుగుల సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి శివశంకర అనే రైతుకు చెందిన మామిడి తోటలోకి ఏనుగులు ప్రవేశించి తోటను ధ్వంసం చేశాయి.…

కర్నూలులో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా : కర్నూలులోని అమీర్‌ హైదర్‌నగర్‌ కాలనీని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వరద ముంపు ప్రాంతం అయినందున ఖాళీ చేయాల్సిందేనని అంటున్న అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రాథమి కోన్నత పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడగా 16 మంది విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.

నెల్లూరుకు క్షేమంగా చేరుకున్న నలుగురు యాత్రికులు

నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లాకు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు నలుగురు ఈరోజు సురక్షితంగా చేరుకున్నారు. మరో నలుగురు నెల్లూరు వాసులు బద్రీనాథ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది.

ప్రభుత్వ పథకాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజానీకం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పనితీరును క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్ల్టు శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్‌ లబ్బి వెంకటస్వామి అన్నారు. మొత్తం 52…