శ్రీహరికోట, నెల్లూరు: పీఎస్‌ఎల్‌వీ-సీ22 వాహక నౌక ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం 64.30 గంటలు నిరంత రాయంగా కొనసాగనుంది. జులై 1 రాత్రి 11 గంటల 41 నిమిషాలకు పీఎస్ ఎల్‌వీ-సీ22 నింగిలోకి దూసుకుపోనుంది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1ఏను పీఎస్‌ఎల్‌వీ-సీ22 రోదసీలోకి మోసుకెళ్లనుంది. ఈ నావిగేషన్ శాటిలైట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.




