Monday, 16 November 2026

వార్తలు

ఆజాద్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ విశ్వాసం కోల్పోతోందని, అవసరమైతే పార్టీకి గుడ్‌బై చెప్పి ఉద్యమిస్తామని ఆయన అన్నారు.

అక్బరుద్దీన్‌ను హాజరుపరచండి : బెంగళూరు కోర్టు

బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని గడువు విధించింది.

అక్బరుద్దీన్‌ను కోర్టుకు తరలింపుపై సందిగ్థత

ఆదిలాబాద్‌ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టుకు తరలించడంపై సందిగ్థత నెలకొంది. అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు మరికోంత సమయం కోరే ఆలోచనలో…

శంషాబాద్‌ విమానాశ్రయంలో 8 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో 8 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు ఈరోజు పట్టుకున్నారు. ఈ బంగారాన్ని దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారని ఆధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో…

ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి షరపోవా జౌట్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ మరో సంచలనం నమోదైంది. సెమీన్‌లో చైనా క్రీడా కారిణి లీనా రష్యా భామ షరపోవాపై 6-2, 6-2 తేడాతో సంచలన విజయం సాధించింది, ప్రత్యర్ధికి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా సెమీన్‌ చేరిన షరపోవా…

నేడు అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

ఆదిలాబాద్‌ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఆదిలాబాద్‌ కోర్టులో విచారణ జరుగనుంది. ఓ మతంపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఆదిలాబాద్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేశ్‌ మోసం చేశాడంటూ ఫైనాన్షియర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వరంగల్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

వరంగల్‌: తెలంగాణపై ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘాల…

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

బిజినేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్‌ ఢీకొట్టింది. ఆ  సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.