Monday, 16 November 2026

వార్తలు

ఇండోనేషియా వరదల్లో 15కు చేరిన మృతుల సంఖ్య

జకార్త : ఇండోనేషియా రాజధాని జకార్తలో గత నాలుగు రోజులుగా వస్తున్న వరదల్లో మృతుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఎక్కువ మంది నీటమునిగి చనిపోయారు. ఈ వరదల వల్ల 2,50,000 మంది ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

భారత్‌ ఘన విజయం

రాంచీ : రాంచీలో శనివారం భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి…

27న చలో రాజ్‌భవన్‌

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఈనెల 27న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమానికి రాజకీయ ఐకాస మద్దతు…

తెదేపా పొలిట్‌బ్యూరోకు అయ్యన్న పాత్రుడు రాజీనామా

విశాఖ: తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని అన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తనకు…

నేపాల్‌ ప్రధానిపై కేసు

ఖాట్మండు : ఓ  జర్నలిస్టు హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు నేపాల్‌ ప్రధానిబాబూరామ్‌ భట్టారాయ్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు  కోర్టుధిక్కారం కింద సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబధం ఉన్న…

ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కేసు

కరీంనగర్‌: అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కరీంనగర్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కరీంనగర్‌ బీజేపీ నేత బండి సంజయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దినిపై స్పందించిన జిల్లా…

27న ఛలో రాజ్‌భవన్‌ : ఓయూ జేఏసీ

హైదరాబాద్‌:  27 తేదిన ఛలో రాజ్‌భవన్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్ధి సంఘాలను ఏకతాటిపైకి వచ్చాయని తెలియజేశారు. సాయంత్రం టీఎన్‌జీవో భవన్‌లో సమావేశం ఉంటుందని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ : కోబ్రా మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓజవాను మృతి చెందాడు. సుక్మా జిల్లా పెమిడి దగ్గర పోలీసులుకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కోబ్రా కమెండో మృతి చెందాడు. మరో ఇద్దరు కోబ్రాలు…

155 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

రాంచీ : భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 155 పరుగులకు అలౌట్‌ అయింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత బౌలర్లలో జడేజా 3, శర్మ ఆశ్విన్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అక్బరుద్దీన్‌ ప్రసంగాల హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం

హైదరాబాద్‌: మజ్లీన్‌ ఎమ్మెల్యే ఓ మతాన్ని కించపరుస్తు చేసిన వివాదస్పద ప్రసంగాలను ప్రసారం చేసిన ఓ చానల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ప్రసంగాలకు సంబంధించిన హార్డు డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.