Monday, 16 November 2026

వార్తలు

పార్టీ ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నాం : యనమల

రాజమండ్రి : తెలంగాణ అంశంపై అఖిలపక్షంలో పార్టీ ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని  తెదేపా సీనియర్‌ నేత యనమల  రామకృష్ణుడు తెలిపారు. పలువురు సీమాంధ్ర తెదేపా నేతలు తెలంగాణ అంశంపై వ్యాఖ్యలు చేస్తుండటంతో యనమల స్పందించారు. వ్యక్తులు చెప్పే…

ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపరు? : పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని సీమాంధ్ర  నేతలను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలితే మాట్లాడేవారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై నోరుమెదపరెందుకని ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

రాంచీ : భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 24 పరుగుల వద్ద కుక్‌ (17) ఔటయ్యాడు. ప్రసుత్తం క్రీజులో పీటర్సన్‌, బెల్‌ ఉన్నారు.

ఇందిరాపార్కు వద్ద సీపీఐ ధర్నా ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనే ధ్యేయంగా సీపీఐ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన సామూహిక ధర్నా ప్రారంభమైంది. సాయంత్రం వరకూ జరగనున్న ఈ ధర్నాలో సీపీఐతోపాటు తెరాస, తెదేపా, రాజకీయ ఐకాస నేతలు పాల్గొంటారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం…

లగడాపాటి ఓ రాజకీయ బపూన్‌ : కేటీఆర్‌

కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్టుపడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి ఓ రాజకీయ బపూన్‌ అని విమర్శించారు. లగడపాటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై…

నిజామాబాద్‌ కోర్టులో అక్బరుద్దీన్‌ హాజరు గడువు పొడిగింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పోడగించింది. అక్బరుద్దీన్‌ హాజరయ్యేందుకు గడువు పొడగిస్తూ మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఉత్వర్వులు జారీ చేశారు.

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

రాంచీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ టాన్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై ధోనికి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండింటిలో చేరో విజయం సాధించిన ఇరు జట్లకు…

రాజమండ్రికి స్సైన్‌జెట్‌ విమాన సర్వీసుల నిలిపివేత

రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయంలో స్సైన్‌జెట్‌ చెన్నై- బెంగుళూరు విమాన సర్వీసులను ఆదివారం నుంచి నిలిపివేయనున్నారు. ఈ సర్వీసులు తిరిగి ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి.

ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం

ముంబయి : సంత్‌నిరంకారి మండల్‌ ఆధ్వర్యంలో ముంబయిలో 45 కిలో మీటర్ల భారీ మానవహారం చేపట్టారు. ట్రిడెంట్‌ హోటల్‌ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన   ఈ కార్యక్రమంలో 4,500 మంది భక్తులు పాల్గొన్నారు. మానవ సమాజంలో ఐక్యత, శాంతి…

కమలానంద భారతికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కమలానంద భారతికి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండు వ్యక్తిగత పూచికత్తులను సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని విచారణకు సహకరించాలని కమలానందను కోర్టు ఆదేశించింది.