Sunday, 15 November 2026

వార్తలు

రెండు లారీల ఢీ, పలువురికి గాయాలు

జోగిపేట (పట్టణం) : రెండు లారీల ఢీ కొని పలువురికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మెదక్‌ జిల్లా ఆంథోల్‌ పరిధిలోని కంసాలపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నారాయణ్‌ఖేడ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు…

సోనియాతో కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ కీలక నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈసమావేశంలో చిదంబరం, ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ఆంటోనీ, షిండే, మొయిలీ తదితరులు పాల్గొన్నారు. జైపూర్‌ మేథోమథనం, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు…

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం చేర్పూరులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థమైంది. ఈ ప్రమాదంలో రూ. 40 లక్షలు, నలభై తులాల బంగారం, 8 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్ల పత్తి, ఎల్‌ఐసీ, పొలం కాగితాలు…

తుపాకీతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో తుపారీతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి తుపాకీ, 5 తుటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

తెలంగాణ కోసం మరో ఉద్యమానికైనా సిద్ధం : టీఎన్జీవో నాయకులు

హైదరాబాద్‌:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి ఉద్యమం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవో నాయకులు స్పష్టం చేశారు. 42 రోజుల పాటు అభివర్ణించారు. సకల జనుల సమ్మెపై వెల్లువెత్తిన వ్యాసాల సమాహారంతో రూపొందించిన సకల జనుల…

బొత్స వ్యాఖ్యల్ని ఖండించిన భాజపా

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ బొత్స  సత్యనారాయణ చేసి వ్యాఖన్ని భాజపా ఖండించింది. బాధ్యత గల మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం…

యరపతినేని బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

గుంటూరు : గురజాల శానసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. పిడుగురాళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త నరేంద్ర హత్య కేసు కుట్రదారునిగా ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి…

వంటగ్యాస్‌ కనెక్షన్ల పోర్టుబులిటీ ప్రారంభం

ఢిల్లీ : వంటగ్యాస్‌ కనెక్షన్లకు పోర్టబులిటీని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. తమకు ఇష్టమైన డీలర్లను వినియోగదారులే ఎంచుకునే అవకాశం ఈ పోర్టబులిటీ సదుపాయంతో కలుగుతుంది.

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఫిబ్రవరి 14న త్రిపుర, 23న మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28న ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అక్బరుద్దీన్‌కి స్వల్ప అస్వస్థత : రిమ్స్‌ వైద్యుల చికిత్స

ఆదిలాబాద్‌: మౌలిక సదుపాయాలు, పరిస్థితులు సమీక్షించేందుకు ఈరోజే న్యాయమూర్తి ఆదిలాబాద్‌ జిల్లా జైలును సందర్శంచారు. జిల్లా జైలులో ఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ తనకు కడుపులో నొప్పిగా ఉందని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు వైద్యులు అక్బరుద్దీన్‌కు…