Sunday, 15 November 2026

వార్తలు

హోంగార్డుల సమస్యలపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినికి సంతాపంగా నిరిసన ప్రదర్శనలు చేపట్టేందుకు  పెద్దసంఖ్యలో యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ కూడలి వద్దకు చేరుకుంది. అత్యాచార ఘటనల్లో చట్టాలను కఠినతరం చేయాలని…

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

చెన్నై: పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు పతనమైన అనంతరం ధోనితో కలిసి నిలకడగా అడుతున్న రైనా (43) హఫీజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ధోని 24 పరుగులతో అడుతున్నాడు.…

రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి

భువనేశ్వర్‌ : ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఈ ఉదయం రైలు ఢీ కొని ఆరు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఏనుగుల మృతదేహాలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది. చర్యలు…

కుప్పకూలిన భారత టాప్‌ ఆర్డర్‌

చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత టాప్‌ అర్డర్‌ కుప్పకూలింది. పాక్‌ బౌలర్ల ధాటికి ఒక్కొక్కురుగా చేతులెత్తేస్తూ పెవిలియన్‌ దారి పట్టడంతో భారత్‌ ఆరు ఓవర్లు ముడిసేసరికి 29 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. పాక్‌…

రేపు ఉదయం బయల్దేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

సికింద్రాబాద్‌: దక్షిణ భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం బయలుదేరాల్సిన ఎపీ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు ఉదయం బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇందులో రిజర్వేషన్‌ చేయించుకున్న…

తెదేపాపై కేసీఆర్‌ విమర్శలు సిగ్గుచేటు : శ్రీహరి

వరంగల్‌ : అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెరాస అధినేత కేసీఆర్‌ విమర్శించడంపై ఆ పార్టీ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెలంగాణవాదులు స్వాగతిస్తే కేసీఆర్‌ విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే…

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే…

బాధితురాలి మృతికి సంతాపంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ

హైదరాబాద్‌: అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ చేపట్టింది. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సీని నటుడు…

బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ : దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలు ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. మృతదేహాన్ని సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తరలించినకొద్ది గంటల్లోనే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. …