Friday, 13 November 2026

వార్తలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉముశ్‌కుమార్‌ తరపు న్యామవాదికి బెయిల్‌

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డికి వ్యతిరేఖంగా యూపీఎస్సీకి ఫోర్జరీ లేఖ రాసిన వ్యవహారంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమెశ్‌కుమార్‌ తరపు న్యాయవాది శ్రీపాదప్రభాకర్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

చర్లపల్లి జైలు నుంచి విమలక్క విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో కన్వీనర్‌ విమలక్క శుక్రవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. టోల్‌గేట్‌ ధ్వంసం కేసులో విమలక్కలను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

ఓఎంసీ కేసులో రాజగోపాల్‌కు తాత్కాలిక బెయిల్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో కీలక నిందితుడు డి.రాజగోపాల్‌ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. రాజగోపాల్‌ తరపు దగ్గరి బంధువు మృతి చెందటంతో నవంబర్‌ 4వరకు తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం…

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్‌: జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్స్‌ కాలనీ వాసికి సైన్‌ప్లూ సోకినట్లు నిర్ధారించారు.

రఘవీరారెడ్డిని ఘెరావ్‌ చేసిన టీడీపీ

అనంతపురం: కల్యాణదుర్గంలో మంత్రి రఘవీరారెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. పంటనష్టం పరిహారం సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచి రైలు

విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్‌ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్‌ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అండమాన్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

అండమాన్‌: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఈరోజు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు పై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

డోన్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రి జప్తు

కర్నూల్‌: లింగనిర్థారణ పరీక్ష చేసినందుకు డోన్‌లోరి ఓ ప్రైవేటు ఆసుపత్రిని  జప్తు చేశారు. నవ్య ఆసుపత్రిలో ఓ గర్భణికి లింగనిర్థారణ పరీక్షలు చేసినట్లు వెలుగు చూడటంతో ఆసుపత్రిని జప్తు చేయాలని కలెక్టర్‌ పటేల్‌ ప్రశాంత్‌ ఆదేశించారు.

ఉపాధిని వ్యవసాయంతో అనుసంధానిస్తాం: బాబు

సి .బెళగల్‌ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , వితంతువులకు రూ. 600 పించను ఇస్తారన్నారు. ప్రభుత్వ తప్పుడు విదానాలతోనే…

30 ఇసుక లారీల పట్టివేత

నల్గోండ : జిల్లా నార్కట్‌పల్లిలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 30 లారీలను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటికి రూ. 4 లక్షలు అపరాదరుసుం విదించారు.