Friday, 13 November 2026

వార్తలు

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. స్వామివారి గజవాహనం ముందు భక్తుల…

డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో సైనా

డెన్మార్క్‌: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ప్రవేశించింది. సెమీన్‌లో వాంగ్‌పై 21-12 12-7 స్కోరు తేడాతో సైనా విజయం సాధించింది.

మధ్యప్రదేశ్‌ ఆలయంలో తొక్కిసలాట ముగురు మృతి-35మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సెహోర్‌ జిల్లాలోని ప్రసిద్ధ శాల్కన్‌పూర్‌ దేవీ ఆలయంలో నవరాత్రుల వేడుకల్లో ఆపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు దుర్మరణం పాలయ్యారు మరో 35మందికి తీవ్ర గాయాలయ్యాయి.

నిలకడగా శంకర్రావు ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్‌: అస్వస్థతకు గురై బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్‌ వైద్యులు తెలిపారు.

తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకే అనేక పథకాలు

హైదరాబాద్‌: తాత్కాలిక ప్రయోజనం పొందేందుకే ప్రభుత్వాలు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చినన్ని తాయిలాలు మరెవరు ఇవ్వలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఇప్పుడు దేశంలో అంతా ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులం,మతం,…

అరేబియాలో బతుకమ్మ వేడుకలు

అరేబియా: ఉద్యోగ,ఉపాధి వేటలో ఎల్లలు దాటిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ప్రవాస తెలంగాణవాసులు పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగా అయిన బతుకమ్మ వేడుకల్ని యూనైటీడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూ.ఏ.ఇ)లో ఎమిరెట్స్‌ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఇ.టి.సి.ఎ) నేతృత్వంలో…

రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు 7,367మంది:అహ్మదుల్లా

హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు 7,967మంది యాత్రీకులు బయలుదేరినట్లు మైనార్టీశాఖ మంత్రి అహ్మదుల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హజ్‌కు పయనమయ్యారని వెల్లడించారు. యాత్రీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు…

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్‌ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో తెలిపారు. ఈ స్థలంలో అయ్యప్ప భక్తులకు రూ.26కోట్లతో డార్మెటరీ, ఆసుపత్రి,…

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సన్నాహాలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల నిర్వాహణకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. డిసెంబర్‌ 27,28,29 తేదిల్లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తిరుపతి మీపంలోని అవివాల చెరువు వద్ద 90ఎకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించారు.

రాంబాబు చిత్రంపై చంద్రవదన్‌ కమిటీ నివేదిక

హైదరాబాద్‌: కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని ప్రభుత్వానికి సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ నేతృత్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 9సన్ని వేశాలు అభ్యంతకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని కమిటీ సూచించింది.