Thursday, 12 November 2026

వార్తలు

పదవి నుంచి వైదొలగిన తమిళనాడు శాసనసభాపతి

చెన్నై: తమిళనాడు రాష్ట్ర శాసనసభాపతి డి. జయకుమార్‌ పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సభాపతి బాధ్యతలనుంచి ఆయన తప్పు కొంటున్నట్లు తమిళనాడు శాసనసభ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సబితాతో భేటీకానున్న ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓయూ జేఏసీ భేటీ కానుంది. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని, తమను మార్చ్‌కు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. గత రెండు…

తెలంగాణ మార్చ్‌కు అడ్డంకులు సృష్టించొద్దు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సర్కార్‌ అడ్డంకులు సృష్టించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బైండోవర్‌ కేసులు పెడితే బీజేపీ నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులకు సంతకాలు చేయవద్దని, అవసరమైనతే జైలుకెళ్లండి అని సూచించారు. హైదరాబాద్‌కు రాలేని వారు జిల్లాల్లోనే…

‘జరగబోయే పరిణామాలకు సీఎం , హోంమంత్రిదే బాధ్యత’:నారాయణ

హైదరాబాద్‌: అరెస్టులను ఆపకపోతే జరగబోయే పరిణామాలకు సీఎం,  హోంమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను, తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి…

సబితాకు ఫోన్‌ చేసిన టీ, కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, చెక్‌పోస్టులు ఎత్తివేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణవాదులకు పోలీసులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అక్రమ అరెస్టులను…

పోన్నం వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్‌

విశాఖ : తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలంగాణ వాదులు లిఖితపూర్వక హమీ ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం అనుమతిచ్చిందని .మంత్రి శైలజానాథ్‌ పెర్కోన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వైఖరిగా అయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిపై ఎంపీ పోన్నం…

నెక్లెస్‌రోడ్డులో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సర్కార్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రేపు మార్చ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తగు…

జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశం

హైదరాబాద్‌: నగరంలోని జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రేపు జరగబోయే మార్చ్‌ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, గాయకుడు రసమయి బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌,…

భాజపా పదాధికారుల సమావేశం

హైదరాబాద్‌:భాజపా కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. రేపు నెక్లెస్‌రోడ్‌లో జరిగే తెలంగాణ కవాతు నిర్వహణపై ఈ భేటీలో నేతలు చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

అనుమతిచ్చి అరెస్టులు చేయడం బాధాకరం: ఎంపీలు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి పిట్టల రవీందర్‌తో పాటు పలువురిని అరెస్టును ఎంపీలు ఖండించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని…