Thursday, 12 November 2026

వార్తలు

తుమ్మపూడి కోటేశ్వరరావుకు జాషువా పురస్కారం

హైదరాబాద్‌: జాషువా జీవిత సాఫల్య పురస్కారానికి తుమ్మపూడి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆచార్య ఎండ్లూరు సుధాకర్‌కు జాషువా విశిష్ట పురస్కానం లభించగా, డాక్టర్‌ ముక్తేవి భారతి జాషువా విశిష్ట మహిళా పురస్కారానికి ఎంపికయ్యారు.

2జీపై తీర్పు ఇతర సహజవనరులకు వర్తించదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్‌ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం కాదని పేర్కొంది. సహజవనరుల కేటాయింపులో అత్యధిక లాభాల పెంపు ప్రాతిపదిక…

కానిస్టేబుల్‌ కత్తితో పొడిచిన మావోయిస్టులు: పరిస్థితి విషమం

ఛత్తీస్‌గఢ్‌: బీజూపూర్‌ జిల్లా ఆవుపల్లి సంతలో ఒక కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజాపూర్‌ జిల్లా మోత్కుపాల్‌లో నలుగురు, మోర్తూరులో ఇద్దకు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

క్యాండి: టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ 8లో తొలిమ్యాచ్‌ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీలంక న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాన్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో ఈ రోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,800కిలో…

సచివాలయ ప్రాంగణంలో 144వ సెక్షన్‌

హైదరాబాద్‌: సచివాలయం ప్రాంగణంలో అధికారులు 144వ సెక్షన్‌ విధించారు. బహిరంగ సభల నిర్వహణ, నినాదాలు, వూరేగింపులు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఈ ఏడాది నవంబరు 18 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సిరిసిల్లకు తరలింపు

కరీంనగర్‌: నిజామాబాద్‌ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట తెరాస కార్యకర్తలతో కలిసి విద్యాసాగర్‌ ఆందోళనకు దిగారు.

తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఈ నెల 30న తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన ‘ తెలంగాణ మార్చ్‌’కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు తెలిపింది. మార్చ్‌కు మద్దతుగా శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు…

ఖమ్మంలో కేటీపీఎస్‌ అరో యానిట్‌ వార్షిక మరమ్మతులు

  కేటీపీఎస్‌ అరో యూనిట్‌ ఈరోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి. ఈ మరమ్మతులవల్ల 120 మోగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

బాక్సైట్‌ గనుల రద్దును స్వాగతిస్తున్నా : మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: బాక్సైట్‌ గనుల రద్దు విషయంలో కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్‌ తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు తూర్పుకనుమలు మానవశరీరంలో గుండెకాయలాంటిదని మంత్రి అభిప్రాయాపడ్డరు. ప్రభుత్వం వెంటనే చట్టపరమైన అంశాలను పరిశీలించి బాక్సైట్‌ ఒప్పం…