Wednesday, 11 November 2026

వార్తలు

సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ నిందుతుడికి బెయిల్‌ పోడగింపు

  న్యూడీల్లీ : సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందుతుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టు బెయిల్‌ను పోడగించింది. దీంతో పాటు ఈ కేసును గుజరాత్‌ నుంచి ముంబయి కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.

ప్రారంభమైన యూపీఏ సమస్యమ కమిటీ సమావేశం

ఢిల్లీ: వివిధ అంశాలపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ సంఘం ఈ రోజు భేటీ అయ్యింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి యూపీఏలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ హాజరయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ యూపీఏ నుంచి వైదొలగిన…

ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌: మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, తెలంగాణ మార్చ్‌పై ఈ సమావేశంలో మంత్రులందరూ  ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం మంత్రులందరూ ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. కవాతు శాంతియుతంగా జరిగే విధంగా దృష్ణ…

టీడీఎల్పీలో తెలంగాణ తెదేపా నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణపై ప్రధానికి తమ అధినేత లేఖ రాసిన అంశంపై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. లేఖ అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అరెస్ట్‌

నిజామాబాద్‌: హైదరాబాద్‌ వస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కామారెడ్డి లో అరెస్టు చేశారు. ఈ రోజ గవర్నర్‌, డీజీపీ, హోంమంత్రులను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్న  ఎమ్మెల్యేను అరెస్టు చేయడం దుర్మార్గమని ఇవి ప్రభుత్వ రెచ్చగొట్టే చర్యలని హరీష్‌రావు…

బాబులాల్‌ జూవెల్లరీ షాపులో చోరీ

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో ఓ నగల దుకాణంలో బుధవారం రాత్రి చోనీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.  20 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు అపహరించకుపోయారు.

మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌: మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌ అంశంతో పాటు, కవాతును వాయిదా వేసేలా ఐకాసను ఒప్పించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కూడా మంత్రులు ఈ సమావేశంలో…

నేడు గవర్నర్‌ నరసింహన్‌తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30 తలపెట్టిన  తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని వారు గవర్నర్‌ను కోరనున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలో ముంబయి స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభాలో ఉన్నాయి.

నేడు ‘టీ’ మంత్రులు భేటీ

హైదరాబాద్‌: ‘తెలంగాణ మార్చ్‌’పై చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ రెడ్డి నివాసంలో నేడు తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించేలా ప్రయత్నించాలంటూ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి పై ఈ…