Wednesday, 11 November 2026

వార్తలు

విద్యార్ధి కవాతు 30కి వాయిదా

హైదరాబాద్‌: టీఎస్‌జీవో భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో తెలంగాణ కవాతుపై చర్చించనున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. తెలంగాణ కవాతుపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు చర్చలకు రావాలని హోంమంత్రి ఆహ్వానించినట్లు ఆయన…

విమలక్కకు 14 రోజులు రిమాండ్‌

హైదరాబాద్‌: ఉదయం అరెస్టు చేసిన విమలక్కను పోలీసులు ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్‌ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విమలక్కకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్క్‌ట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి ధరలతో పోలీస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.31,820కి చేరింది.22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,300గా ఉంది. కిలో…

‘అధికార్‌ యాత్ర’ ప్రారంభిస్తున్న నితీశ్‌ కుమార్‌

సీతామర్హి: కేంద్రంలోని రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీహర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే కార్యక్రమం చేపట్టారు. అధికార్‌ యాత్ర పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా…

జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని కుప్పారా జిల్లా కర్నాహ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

న్యూయార్క్‌లో తొలి త్రైపాక్షిక చర్చలు

వాషింగ్టస్‌: అమెరికా, భారత్‌, ఆప్ఘనిస్థాన్‌ల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక చర్చలు న్యూయార్క్‌లో జరగనున్నాయి. సమితి సాధారణ సభ ఆరవ వార్షికసమావేశం జరిగేటప్పుడే మరో పక్క ఈ చర్చలను నిర్వహించనున్నారు. డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ స్థాయిలో ఈ చర్చలు జరుగుతాయని…

అసోంలో పోటెత్తిన వరదలు.. ఆరుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉద్థృతితో 16 జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాలతో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది పునరావాస…

ఆశ్రమంలో తొక్కిసలాట..9 మంది మృతి

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రం దేవ్‌ఘడ్‌లోని ఓ ఆశ్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడానికి వేలాదిగా…

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.