Wednesday, 11 November 2026

వార్తలు

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ మంత్రుల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ కోర్‌  కమిటీ సభ్యులకు తెలంగాణ మంత్రులు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప  ప్యాకేజీలు, పదవులు అక్కర్లేదని లేఖలో పేర్కొన్నాట్లు మంత్రులు తెలియజేశారు.

మద్యం సిండికేట్‌ కేసులో ఎంతటివారినైనా వదలవద్దు: హైకోర్టు

హైదరాబాద్‌: మద్యం సిండికేట్‌ వ్యవహారంలో ఎంతటివారినైనా వదలవద్దని ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు  నివేదికను 4 వారాల్లో సమర్పించాలని ఏసీబీనికోర్టు ఆదేశించింది.

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ తోలిరోజు ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది ఈ ఉదయం సమావేశాలుప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులుసభను అడ్డుకున్నారు దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 45 నిమిషాలపాటు…

తెలంగాణ న్యాయవాదుల బైక్‌ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సన్నాహక ర్యాలీగా ఇవాళ తెలంగాణ న్యాయవాదులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాంపల్లి కోర్టు నుంచి మియాపూర్‌ కోర్టు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ రాజకీయ జేఏసీ  ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో…

తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటాం: హరీషరావు

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యుద్ధభేరీ మోగిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హారీష్‌రావు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌  పార్టీ మార్చ్‌లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో…

23 న జరగాల్సిన కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 23న జరగాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రసదస్సు వాయిదా వేసినట్లు పీసీసీ అధినేత బోత్స వెల్లడించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాకే పాంతీయ సదస్సులపై అలోచిస్తామని తెలిపారు. తెలంగాణ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే రాష్ట్ర…

రాంచీ సమీపంలో పడవ ప్రమాదం

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ సమీపంలోని స్వర్ణరేఖ నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 23 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనేగాలింపు చర్యలు చేపట్టారు.

తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తాం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. హైదరాబాద్‌ విలీన దినోత్సవ సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద జాతీయ  పతాకంతోపాటు ఐకాస జెండాను ఆవిష్కరించారు. విలీన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సు పై పునరాలోచించాలి: పొన్నం

హైదరాబాద్‌: ఈ  నెల 23న జరిగే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సుపై అధిష్ఠానం పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలో వేర్వురుగా సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఒకే సదస్సు నిర్వహిస్తే తెలంగాణ,…

శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది దైవిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా సాయంత్రం నిర్వహిస్తారు. ఈసందర్బంగా స్వామి వారికి వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే…