Wednesday, 11 November 2026

వార్తలు

ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎఎంయూ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తాంగా 1866 మంది కండక్లర్లు, 968 మంది డ్రైవర్ల ఉద్యోగ క్రమబద్ధీకరణకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని ఎన్‌ఎంయూ ఓ ప్రకటనలో పేర్కొంది

డేవిస్‌కప్‌లో భారత్‌ విజయం

రేవిస్‌కప్‌: డేవిస్‌కబీప్‌లో భాగంగా ఆసియా-ఓషీనియా గ్రూప్‌-1 రెలెగేషన్‌ ప్లేఆఫ్‌లో భారత్‌ విజయం సాధించింది. రెండు సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ను భారత్‌ గెలుచుకుంది. రెండో రౌండ్లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. అక్టోబరు 19 నుంచి 21 వరకూ రెండో…

ఏడాదికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లను పరిమితం చేయడం అన్యాయం: చంద్రబాబు

హైదరాబాద్‌: చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల చాలా నష్టపోతామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని…

డీవామింగ్‌ మాత్ర అడ్డుపడి విద్యార్ధిని మృతి

హైదరాబాద్‌: నల్లగుట్ట పాఠశాలలో పంపీణి డీవామింగ్‌ మాత్ర గొంతులో అడ్డుపడి విద్యార్ధిని మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలంచారు. కాలం చెల్లిన మాత్రలు వేసుకోవటం వల్లే విద్యార్ధిని మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

సీఎంపై లోకాయుక్త అసంతృప్తి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో తల పెట్టిన రాజీవ్‌ స్వగృహ, ఇందిరమ్మఇళ్ల స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్వానికి రాష్ట్ర లోకాయుక్త ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను సంబంధించిన ఫైల్‌ను ఎలాంటి పురోగతి లేకుండా దీర్ఘకాలం ఎలా అట్టిపెట్టుకుంటారని…

‘వనదీక్ష’లో రచ్చకెక్కిన విభేదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. మెట్రో రైలు వనదీక్ష కార్యక్రమాన్ని శనివారం పార్లమెంటు సభ్యులు మంత్రి మహీధరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సర్వే సత్యనారాయణ,ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం…

ముగిసిన బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌

కర్ణాటక : బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి శాంత 2,243 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంత గెలుపును రిటర్నింగ్‌ అధికారిధికారికంగా ప్రకటించలేదు.

తెలంగాణ మార్చ్‌ చేసి తీరుతాం: టీజీవో అథ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: ఎంత మందిని అరెస్టు చేసినా సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ నిర్వహించి తీరుతామని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం అరెస్టులతో తెలంగాణ మార్చ్‌ను ఉద్యమకారులను అడ్డుకోవాలనడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు.

టీ-20 వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు

కొలంబో: టీ-20 వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన  భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక శ్రీలంక 120 పరుగులకే ఆలౌట్‌ అయింది.

పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి

వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.