Wednesday, 11 November 2026

వార్తలు

మంత్రి కుమారుడి కారు స్వాధీనం

హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడుపుతున్న మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కారును బంజార్‌హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని అడ్డుకున్న టీజీవీపీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అడ్డుకుంది. ఈ నెల 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలనే డిమాండ్‌తో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీజీవీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి…

సమస్యల్లో చేనేత కార్మికులు: ముఖ్యమంత్రి

మహబూబ్‌నగర్‌: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్‌ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

తెలంగాణ వాదులను విడుదల చేయాలి: జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌: పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు తమకు  ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి ఉందని ఆయన తెలియజేశారు.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నిన్న  మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత  తగ్గు ముఖం పట్టాయి. బులియన్‌ మార్కేట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది.…

సుదర్శన్‌ మృతిపై చంద్రబాబు సంతాపం

హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కె.ఎన్‌ సుదర్శన్‌ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసి ఆయన సేవలను కొనియాడారు.

నేడు భారత్‌-శ్రీలంక వామప్‌ మ్యాచ్‌

కొలంబో: టీ-20 ప్రపంచ కప్‌ కోసం టీమిండియా ప్రాక్టిస్‌ మొదలుపెట్టింది. భారత్‌-శ్రీలంకలు  ఇవాళ వామప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. వామప్‌ మ్యాచ్‌లో భాగంగా ఈ నెల 17 న పాకిస్థాన్‌ జట్టుతో కూడా టీమిండియా జట్టు తలపడనుంది. ప్రపంచ కప్‌…

తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా లాయర్లు ర్యాలీ

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’కు మద్దతుగా తెలంగాణ లాయర్లు కదం తొక్కారు. ఇవాళ వాళ్లు సాలార్‌జంగ్‌ మ్యూజియం నుంచి ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.…

బళ్లారి లోక్‌సభ ఎన్నికల రీకౌంటింగ్‌ ప్రారంభం

బెంగళూరు: బళ్లారి లోక్‌సభ ఎన్నికల రీకౌంటింగ్‌ ప్రారంభమైంది. 2009లో గెలిచిన భాజపా అభ్యర్థి శాంత ఎన్నిక  చెల్లదని కాంగ్రెస్‌ అభ్యర్థి హనుమంతప్ప గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై…

కేసీ కెనాల్‌కు తాగునీటి కోసం రైతుల ఆందోళన

కడప: కేసీ కెనాల్‌కు తాగునీరు ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి రైతులు ఈ ఉదయం మైదుకూర్‌లోని జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో రహదారిపై వాహనాలు  నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు ఆందోళనకారులను…