Wednesday, 11 November 2026

వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరీ పేట వద్ద గూడ్సురైలు పట్టాలు తప్పింది. దాంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

నెల్లూరు: రెండురోజులుగా నెల్లూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జిలుగా జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకా నందరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

పైకప్పు పెచ్చులు పడి ఉపాధ్యాయురాలికి గాయాలు

కర్నూలు: జిల్లాలోని డోన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించకున్నారు. తరగతిగదిలో పద్మజ అనే ఉపాధ్యాయురాలు బోధిస్తున్న సమయంలో తరగతి గది పైకప్పు పెచ్చులు వూడి ఆమెపై పడటంతో తలకు గాయమైంది.…

27మంది కమ్యూనిటీ గార్డుల నియామకం

విశాఖపట్నం : నగర కమిషనరేట్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గార్డుల వ్వవస్థలో 27మందికి శిక్షణ ఇచ్చి నియమించినట్లు సీపీ పూర్ణ చంద్రరావు తెలిపారు. బుధవారం కమిషనరేటే సమావేశ మందిరంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

రామడుగులో మలేరియాతో మహిళ మృతి

కరీంనగర్‌: రామడుగు మండల కేంద్రంలోని అమరగొండ ఉమ(45) మలేరియా జ్వరం సోకి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉమకు కరీంనగర్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యులు…

తెదేపా కార్పొరేటర్ల ధర్నా

హైదరాబాద్‌: జలమండలిని ప్రైవేటుపరం చేయరాదంటూ సచివాలయం ఎదుట తెదేపా  కార్పొరేటర్లు ధర్నా చేయటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలి

విజయనగరం: ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ అన్నారు. స్వరాజ్య ఉద్యమ సమావేశాన్ని బుధవారం విజయనగరం నుంచి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ యాజమాన్యాలకు కొమ్ముకాసేందుకే సెప్టెంబరు 3న జీవో జారీ…

‘షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది’

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మంత్రి బసవరాజు సారయ్య తెలియజేశారు. తెలంగాణకు కేంద్రం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ…

అక్టోబర్‌ 30న ‘ఛలో రాజ్‌భవన్‌’

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్ధి జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్‌ 30 ‘ఛలో రాజ్‌భవన్‌ ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యార్థి జేఏసీ తెలిపింది. సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు విద్యార్ధి…