ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం
పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుంబపోతగా కురుస్తున్న వానకు కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో చెరువుకు గండి పడింది. దాంతో పలు పంటపొలాలు నీట మునిగాయి.
పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుంబపోతగా కురుస్తున్న వానకు కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో చెరువుకు గండి పడింది. దాంతో పలు పంటపొలాలు నీట మునిగాయి.
హైదరాబాద్: అనుమతి లేకుండా ప్రసారాలు చేస్తున్న మూడు కేబుల్ టీవీ ఛానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో, మెగా, మిర్చి మ్యూజిక్ అనే ఛానళ్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు ఈరోజు ప్రారంభం అయిన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. గత వారం రోజులుగా బొగ్గు కుంభకోణం వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆందోళన సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ వాయిదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు…
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు శ్రవణ్‌గుప్తా ఈ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఎమ్మార్, ఎంజీఎఫ్ ఎండీ అయిన శ్రవణ్‌గుప్తాను సీబీఐ నేడు విచారిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్‌లోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ కేంద్రంలో చొరబడిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానికి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం శెట్టిపల్లిలో మూడేళ్ల చిన్నారితో సహా మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జల్లేరు, బైనేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి., దీంతో కాలువల్లో భారీగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఈమండలాల్లోని 30 గ్రామాలకు నిలిచిపోయినా రాకపోకలు.
ముంబయి: ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్ 90 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని జేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామన్నారు. నాంపల్లిలోని టీఎస్‌జీఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వామిగౌడ్ సన్మానసభలో పాల్గొన్న ఆయన…
ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు వద్దఈ రోజు ఉదయం విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూలు బస్సు చెరువులో పడింది. ఈప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి…