Tuesday, 10 November 2026

వార్తలు

ఫీజు చెల్లింపుపై నేడు ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కొత్తగా ప్రవేశం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలలాంగ విద్యార్థులకు భోధన రుసుం పథకం కింద ఎంతమొత్తం చెల్లించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సృష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం…

బీహెచ్‌ఈఎల్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల మెరకు సమ్మె

మెదక్‌: జిల్లాలోని బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురం యూనిట్‌లో రెండు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. తనిఖీల పేరుతో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బింది వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళలను వేధించిన సిబ్బందిని తొలగించే వరకు సమ్మె…

లారీ-బైక్‌ ఢీ కొన్ని ఒకరి మృతి

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ చౌరస్తాలో బైక్‌ను లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

నేడు మెదక్‌ జిల్లాలో పీఏసీ కమిటీ పర్యటన

మెదక్‌: ఈ రోజు శాసనసభా ప్రజా పద్దుల సంఘం మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో పర్యటించనుంది. జిల్లాలో దళితులకు పంచిన భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.  

కంటిపై కణితికి అపరేషన్‌ చేయనున్న ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్‌: కంటిపై భయంకరమైన కణితితో నరకయాతల అనుభవిస్తున్న ఖమ్మం జిల్లా బాలుడికి హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో ఆ బాలుడికి ఆపరేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. భద్రాచలం మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన ఏడేళ్ల ప్రవీణ్‌ రేపు ఉదయం…

సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌కు ఘనంగా నివాళులు

హైదరాబాద్‌: పావ్‌ సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ జన్మదిన ఉత్సవాలను హైదరాబాద్‌ యువత ఘనంగా నిర్విహించారు. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ సత్యం, కలర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అకాడెమీ సంయుక్తంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ మాలలో ఈ వేడుకలు…

జలయజ్ఞం ప్రజెక్టులపై సమావేశం

హైదరాబాద్‌: భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జలయజ్ఞం ప్రాజెక్టులపై లేక్‌వ్యూ అతిధిగృహంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రెండేళ్లలో ఆంధ్ర ప్రాంతంలో 12, రాయలసీమలో 14, తెలంగాణ జిల్లాల్లో 24 ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసేందుకు…

రైలు ఢీకొట్టడంతో వృద్దురాలి మృతి

మందస : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలో బాలిగాం వద్ద రైలు ఢీకొట్టడంతో పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టాలు దాటుతున్న ఆమెను ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.

ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయలి

హైదరాబాద్‌: తెలుగు భాషా పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వశాఖను చేయాల్సిన అవసరం వుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శతకవులు, సాహితీవేత్తలను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లడుతూ కాళాశాల…

ఒక రోజు వాయిదా పడిన ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

హైదరాబాద్‌: ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యుల్‌లో స్వల్ప మార్పులు చేశారు. గురు వారానికి బదులుగా శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. బోధనా ఫీజుల ఖరారులో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో షెడ్యుల్‌ లో మార్పులు…