Tuesday, 10 November 2026

వార్తలు

వారాసిగూడలో ధూంధాం విజయవంతం

బౌద్దనగర్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఛలో హైదరాబాద్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ వారాసిగూడలో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కార్యక్షికమం జయపూపదమైంది. కార్యక్షికమమంలో రసమయి బాలకిషన్‌ బృందం పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా…

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 6 పాయింట్లకేపైగా లాభంతో కొనసాగుతోంది.

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: తూర్పు ఇండోనేషియాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. టొబెలో పట్టణానికి 138 కిలోమీటర్ల దూరంలో ఉత్తర మొలుకాన్‌ సముద్ర ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. అయితే ఈ ప్రకంపనలతో…

నేడు పాక్‌ సుప్రీంకోర్టుకు ప్రధాని అష్రాఫ్‌

ఇస్లామాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసులో పాక్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అష్రాఫ్‌ నేడు ఆ దేశ సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. అధ్యక్షుడు జర్దారీ మనీలాండరింగ్‌  కేసుల పునర్విచారణ కోసం స్విస్‌ అధారిటీస్‌కు లేఖ రాయడంలో విఫలమైనందుకు సుప్రీ కోర్టు…

ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన పెరగడంతో ఆయన్ను, ఆయనతో పాటు…

పోటీతత్వం ఉన్నంత కాలం ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చు-కలాం

కోల్‌కతా: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అనుమతించడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మద్దతు పలికారు. అభివృద్ది చెందుతున్న ప్రపంచం అభివృద్ది చెందినది కావాలంటే.. అక్కడ తప్పనిసరిగా పోటీతత్వం, దూసుకుపోయే వాతావరణం ఉండాలని చెప్పారు. మనకు ఇది…

చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తాం

నల్గొండ: నాగర్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టుని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు…

వికలాంగుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌తో మందకృష్ణ భేటీ

హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్యమానికి మద్దతు ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్‌ను ఎమ్మార్పీఎన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. వికలాంగులకు 7 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌…

ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై బరాక్‌ ఒబామా సంతాపం

వాషింగ్టన్‌: చందమామపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం వ్యక్తంచేశారు. అమెరికా అత్యుత్తమ హీరోల్లో ఆయనొకరని కొనియాడారు. మానవాళికి సంబంధించి ఆయన సాధించిన ఘనత ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. 1969…

రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ కొత్తరకం సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ కొత్తరకం సేవల్ని ముందుకు తీసుకువచ్చింది. వన్‌కార్డు పేరుతో అన్ని రకాల ఆర్థిక సేవల సదుపాయాల్ని వన్‌కార్డు టెక్నో సర్వీసేస్‌ సంస్థ తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీలో భారత మాజీ క్రికెటర్‌ సౌరభ్‌…