Monday, 9 November 2026

వార్తలు

వరంగల్‌ ఎంజీఎం విద్యార్థినిలకు అస్వస్థత

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలోని నర్సింగ్‌ కాలేజికి చెందిన విద్యార్థినిలు 20మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలు వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్నారని వైద్యుల్‌ తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని …

తుంగభద్ర ఎగువ కాలువకు గండి

కనేకళ్లు, అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువకు ఈ ఉదయం గండిపడింది. కాలువ 136/800 ప్రాంతం వద్ద గండి పడిన ప్రదేశాన్ని హెచ్‌ఎల్‌సీ డీఈ శ్రీనివాసనాయక్‌ పరిశీలించారు. నీరు వృధాగా పోతుండటంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు.

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయం వైపునకు దూసుకువచ్చారు.…

లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: మంత్రి దనాం నాగేందర్‌ నిన్న వీరంగం సృష్టించిన బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హరేకృష్ణ మూప్‌మెంట్‌ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజుపై నిరసిస్తూ మంత్రి నిన్న ఆలయానికి తాళం వేయడంతో…

పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యం  సేవించిన కేసులో రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఈ తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు ఉస్మానియా అసుపత్రికి తరలించారు.

బోధనా ఫీజులపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపు, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు, ఫీజు విధానంపై ముఖ్యమంత్రి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చాక మంత్రి వర్గ ఉపసంఘం నేతలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష…

ఒంగోలు చేరుకున్న చంద్రబాబు

ప్రకాశం: వాన్‌పిక్‌ ప్రాజెక్టు రద్దు కోరుతూ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గనడానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఒంగోలు చేరుకున్నారు. అనంతరం ఒంగోల్‌ ఎస్‌ఎస్‌పీ అతిధి గృహంలో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆందోళనలో భాగంగా వాన్‌పిక్‌ భూసేకరణ…

14న ‘ గురుకుల ‘ చివరి కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో రెండో కౌన్సెలింగ్‌ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ నెల 14న చివరి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి జి.గోపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

నిమ్స్‌ వద్ద భారీ గుంత.. రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌: పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఫైవ్‌లైన్‌  పనుల కోసం ఇక్కడ గత కొన్ని రోజులుగా గుంతలు తవ్వుతున్నారు. అయితే…

సీఎం బస చేసిన అతిథిగృహం ముట్టడికి సీపీఎం యత్నం

ఖమ్మం: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధిగృహం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ అతిధిగృహం సమీపంలోకి దూసుకువచ్చారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.…