Monday, 9 November 2026

వార్తలు

పోలవరంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఏలూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరద ఉద్ధృతితో జిల్లాలోని కొత్తూరు, రామయ్యపేట గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌ కర్మాగారంలోని పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

వరంగల్‌ జిల్లాలో మూతపడిన ఆలయాలు

వరంగల్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్‌ జిల్లాలో అర్చకులు సమ్మెకు  దిగారు. దీంతో జిల్లావ్యాప్తంగా 400 ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు ఆర్చకులు నిరసన చేపడుతున్నారు.

హాకీలో భారత్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత్‌ మళ్లీ ఓటమి పాలయింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 0-3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

లారీని ఢీకొన్న అంబులెన్స్‌.. ఇద్దరి మృతి

విజయనగరం : పూసపాటిరేగ మండలం గైతుల చోడవరం వద్ద బుధవారం ఉదయం ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే  మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స…

14 శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ నికర లాభం  37 శాతం తగ్గింది. అమ్మకాలు 14 శాతం పెరిగి సంస్థ రూ. 762.2 కోట్ల లాభాలను…

ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాకు బయలుదేరివెళ్లారు. జిల్లాలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్‌

హైదరాబాద్‌: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం నుంచి  దేవాలయలన్నింటిలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు గంగు భానుమూర్తి, కార్యదర్శి పి. మల్లికార్జున్‌ తెలియజేశారు. అర్చకలందరీకి ఆలయాలతో …

గోదావరిలోకి భారీగా వరద నీరు

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 6.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి జూన్‌లో 25, జూలైలో 251…