Monday, 9 November 2026

వార్తలు

రాజధానిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై

హైదరాబాద్‌: రాజధానిలోని పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలోని మహిళ పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. ఎస్సై లలిత ఓ కేసుకి సంబంధించి రూ.10వేలే లంచల తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.…

17 లక్షల మంది విద్యార్థులకు నష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథక నిర్వహణపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై  మండిపడ్డారు. ఓట్లకోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రారంభించిన ఈ పథకాన్ని  ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఫీజుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా ఎలాంటి కౌన్సెలింగ్‌లను నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ…

శంషాబాద్‌ విమానాశ్రయంలో సైనాకు ఘన స్వాగతం

హైదరాబాద్‌:  లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య విజేత హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. శాప్‌ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సైనాకు అభినందనలు తెలిపారు. శంషాబాద్‌ నుండి గోపిచంద్‌ అకాడమీకి భారీ సంఖ్యలో అభిమానుల…

భారత్‌-పాక్‌ దళాల మధ్య ఎదురు కాల్పులు

శ్రీనగర్‌: పూంచ్‌ జిల్లా కెర్నీ సెక్టార్‌లో భారత్‌-పాక్‌ సైనిక దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి.

గంజాయి పట్టివేత

విశాఖ: మాడుగుల మండలం వీరవెల్లి అగ్రహారం వద్ద వ్యానులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని  స్వాధీనం చేసుకున్నారు.

వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపుదలకు నిరసనగా ఆందోళన

విజయవాడ: ప్రగతి శీ ప్రజాసౌమ్య విద్యార్థి సంఘం వృత్తి విద్యాకళాశాలల్లో పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని బెంజ్‌ సర్కీల్‌ సమీపంలోని మహిళ కళాశాల వద్ద నిరసన చేశారు. విద్యార్థులకు భారం మోపకుండా తక్షనమె ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. స్వామివారిని సోమవారం 79,475మంది భక్తులు దర్శించుకున్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌హౌస్‌లో ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.ఓటు వేయడానికి పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులు మాత్రమే అర్హులు. ఈ…