Monday, 9 November 2026

వార్తలు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ సచావాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ యువమోర్చ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి యత్నించారు. విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు త్వరగా షెడ్యూల్‌ క్రటించాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ప్రధానగేటువద్ద పోలీసులు అడ్డుకుని…

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో బోదన ఫీజులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమివేశమయింది. బోధన ఫీజుల అంశంపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఉపసంఘానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించి పలు అంశాలను ప్రభుత్వానికి నివేదించటానికి ఉపసంఘం భేటీ అయింది.

ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం: నాగేశ్వరరావు

ఖమ్మం: ఇందిబాట పేరుతో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆయన పర్యటనను ఆడ్డుకుంటామని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరావు హెచ్చరించారు. ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల…

కేంద్ర నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది: బొత్స

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన  అవసరం ఉందని…

సుప్రీంలో యడ్యూరప్పకు చుక్కెదురు

ఢిల్లీ: సుప్రీం  కోర్టులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చుక్కెదురైంది. గనుల కేటాయింపు కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

అంగారకుడిపై దిగిన క్యూరియాసిటి రోవర్‌

వాషింగ్టస్‌: అంగారక గ్రహం పై జీవం ఆనవాళ్లను పసిగట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ప్రయోగించిన ‘ క్యూరియాసిటీ’ రోవర్‌ సోమవారం నిర్దేశిత లక్ష్యంపై కాలు మోపింది. ఉదయం 11 గంటలకు ఇది ఆ గ్రహంపైనున్న గేల్‌…

ఏసీబీ ఎదుట హాజరైన సోమశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి వరుసగా నాలుగోరోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కోసం జరిగిన కుట్రలో బళ్లారి ఎమ్మెల్యే అయిన సోమశేఖర్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.…

కాంగ్రెస్‌ చేతకానితనం వల్లే గ్యాస్‌ తరలిపోయింది

చిత్తూరు: కాంగ్రెస్‌ పార్టీ చేతకానితనం వల్లే రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ మహారాష్ట్రలోని రత్నిగిరి ప్రాజెక్టుకు తరలిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. మాజీ ఎంపీ చెంగ్రలాయనాయుడు సంస్మరణ సభలో పాల్గొనడానికి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా…

గల్లంతైన పడవ ఆచూకీ లభ్యం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద గల్లంతైన ఓ పడవ ఆచూకీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో లభ్యమైంది. మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరుకున్న ఓ మత్స్యకారుడు మెరైన్‌ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో పడవలో ఉన్న మిగిలిన ఆరుగురిని…

మన్మోహన్‌సింగ్‌ కలిసేందుకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించిన అంశంపై మంత్రులు, ఎంపీల  ప్రతినిథి బృందం సీఎం నేతృత్వంలో ప్రధానితో సమావేశం కానుంది. గ్యాస్‌…