Monday, 9 November 2026

వార్తలు

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఆకస్మికంగా వరదలు పోటోత్తాడంతో ఇప్పటి వరకు…

కల్తీకల్లు ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

మెదక్‌: జిల్లాలోని పెదచిట్యాలలో కల్తీకల్లు తాగి 12 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందించాలని ఫోన్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సైనాకు సీఎం, గవర్నర్‌, చంద్రబాబు అభినందనలు

హైదరాబాద్‌: లండన& ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. సైనా నెహ్వాల్‌కు హర్యానా ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది.

ఆటో సమ్మె వాయిదా

హైదరాబాద్‌: ఈనెల 6న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తల పెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆటో సంఘాల నేతలు ప్రకటించారు. ఆటోల కనీస రుసుము పెంచాలన్న ఆటో సంఘాల డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఆటో సంఘాల…

సైనా కల ఇప్పటికి నెరవేరింది

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కాంస్యపతకం సాధించడంపై ఆమె తండ్రి హర్‌వీర్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న సైనా కల ఇప్పటికి నెరవేరిందని ఆయన అన్నారు. కాంస్యం కోసం జరిగిన…

ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ఒంగోలు: ఈనెల 9,10 తేదీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్లు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు తెలిపారు. ఎర్రన్నాయుడు మాట్లాడుతూ 9న గుంటూరు జిల్లాలో, 10న ప్రాకాశం జిల్లాలోని వాస్‌పిక్‌ భూములను పరిశీలించి, బాధితుల…

ప్రజెక్టు పనులు నిలిపివేస్తాం

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. టెండరు దాఖలు చేసినప్పటికీ, ప్రస్తుతానికి ప్రాజెక్టు నిర్మాణం విలువ రెట్టింపవుతోందనీ, ఫలితంగా పనులు చేపట్టలేకపొతున్నామన్నారు. నెల రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించకుంటే…

సోమశెఖరరెడ్డిని విచారించిన ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడు గాలి సోమశేఖరరెడ్డి ఇవాళ రెండో రోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏడు గంటలపాటు అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఇదే కేసులో మరో నిందితుడు గాలి బంధువు దఖరధరామిరెడ్డి, సోమశేఖరరెడ్డిని…

ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జూనియర్‌ ఆసిస్టెంట్‌ పర్సనల్‌ ఉద్యోగుల నియామకానికి నిర్వహించిన ఇంటర్వూల ఫలితాలు విడుదల చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జూనియర్‌ అసిస్టెంట్‌ పర్సనల్‌ ఉద్యోగాలకు 187 మంది ఎంపికయ్యారని, వివరాలను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో…

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన దేవెంద్రోసింగ్‌

లండన్‌: ఒలింపిక్స్‌ 49కిలోల బాక్సింగ్‌ విభాగంలో భారత క్రీడాకారుడు దేవోంద్రోసింగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్యార్టర్స్‌లో మంగోలియా బాక్సర్‌ సెర్డాంబాపై 4-3, 4-2, 8-6తో దేవెంద్రో సింగ్‌ విజయం సాధించాడు.