Monday, 9 November 2026

వార్తలు

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భక్తులు

ఇంద్రకీలాద్రి: శ్రావణమాసం ఈ రోజు సెలవుదినం కావటంతో భక్తులు భారీగా అమ్మవారి దర్శినానికి తరలివచ్చారు. వాహనాల రద్దీ పెరిగిపోవటం, పార్కింగ్‌ నిండిపోవటంతో ఘాట్‌రోడ్డుపైకి నాలుగుచక్రాల ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. దేవస్థానం బస్సులలోనే భక్తులను పైకి అనుమతించారు.

డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి

విశాఖ: ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏవీపీ డ్యాం నుంచి 4 వేల క్యూసెక్కుల…

రైలు ప్రమాద ఘటన నమూనాలు ఫోరెనిక్‌క్స లేబరేటరీకి చేరలేదు:లేబరేటరీ డైరెక్టర్‌ మూర్తి

హైదరాబాద్‌: రైలు ప్రమాద ఘటన నమూనాలు ఫోరెనిక్స్‌ లేబరేటరీకి చేరలేదని లేబరేటరీ డైరెక్టర్‌ వైఎన్‌.మూర్తి తెలిపారు. నమూనాలు వచ్చిన తర్వాత నివేదిక కోసం 10రోజుల సమయం పడుతోందని ఆయన తెలిపారు. నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలం

విజయవాడ: విద్యుత్‌, గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అంధకారంలో చిక్కుకుందని ఆ పార్టీ కార్యదర్శి నారాయణ విజయవాడలో ధ్వజమెత్తారు. కేజీ బేసిన్‌ నుంచి గ్యాస్‌ను తరిలించుకుపోయి. రాష్టానికి తీవ్ర అన్యాయం చేస్తున్నా కిరణ్‌…

తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు

ఖమ్మం: ఎగువన భారీ వర్షాలతో చర్ల వద్ద తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 14 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

రాజాంరూరల్‌: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన మారణకాండపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ వ్యక్తం చేశారు. లక్ష్మీపేట  నేపథ్యంలో ఆదివారం రాజాంలో ఉత్తరాంధ్ర సదస్సు నిర్వహించారు. కులం, వర్గం,…

ఆదిలాబాద్‌లో పోలీసు కుటుంబసభ్యుల ఆందోళన

ఆదిలాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలనిఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబసభ్యుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ భర్తలను నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట ఏపీఎస్పీ పోలీసు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దూరప్రాంతాల్లో…

సరిహద్దులో ఉద్రిక్తత

తడ: రాష్ట్ర సరిహద్దు తడ మండలం కారూరు, తమిళనాడు పరిధిలోని నొచొకుప్పం మధ్య గత మూడు రోజులుగా చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఆదివారం మరోమారు ఉద్రిక్తత నెలకొంది. కారూరుకు చెందిన ఓ దుకాణంలో వ్యక్తిని నొచికుప్పం గ్రామస్థులు కొట్టారని…

ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబాలతో ఉన్నతాధికారుల చర్చలు

హైదరాబాద్‌: నిన్న ఆందోళనకు దిగిన ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు చర్చలు ప్రారంభించారు. ఏపీఎస్పీ డీజీగా అరుణాబహుగుణ నిర్ణయాలే సమస్యకు కారణమని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎపీఎస్పీ 5వ బెటాలియన్‌, 8వ బెటాలియన్‌లో పరిస్థితిని ఏపీఎస్పీ…

ఒలింపిక్స్‌లో హైద్రాబాదీ సైనాకు కాంస్యం

లండన్‌: హైద్రాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.శనివారం జీన్‌వాంగ్‌తో కాంస్యంకోసం జరిగిన పోరులోవిజయం సాధించి ంది. ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైన సైనా శనివారం జీన్‌వాంగ్‌తో జరిగిన పోరు లో ఆమె విజయం…