Sunday, 8 November 2026

వార్తలు

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గు గునులపై కూడా పడింది. సాయంత్రం 5 గంటల నుంచి 19 గనుల్లో బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

ఆరోగ్యకార్డుల జారీలో పారదర్శకత పాటించాలి

హైదరాబాద్‌: ఆరోగ్యకార్డుల జారీలో ప్రభుత్వం గుర్తింపు పోందిన అన్ని సంఘాల అభిప్రాయాల మేరకే ఆరోగ్యకార్డులపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యకార్డులపై నిర్వహించిన సమావేశానికి కొన్ని సంఘాలనే పిలిచి మొక్కుబడి తంతుగా ముగించేందుకు…

బెంగాల్‌ బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు

బుర్దువాస్‌: పశ్చిమబెంగాల్‌ లోని బుర్దువాస్‌ జిల్లా పండవేశ్వర్‌లోని ఈసీఎల్‌ సౌత్‌ శ్యామలా బొగ్గు గనిలో గురువారం లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో 21 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వాందరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి గనిలో పనికి…

ఇంజినీరింగ్‌ ప్రవేశాలు తక్షణమే చేపట్టండి

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని భాజపా ప్రధాన కార్యాలయంలో నాయకులు అరుణజ్యోతి, శ్రీదర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలిసి కిషన్‌రెడ్డి విలేకరులతో…

కేరళలో డీవైఎఫ్‌ఐ కార్యకర్త మృతి

తిరువనంతపురం: కేరళలో గురువారం సీపిఎం చేపట్టిన హర్తాళ్‌ సందర్బంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పార్టీ అనుబంధ విభాగమైన డీవైఎఫ్‌ఐ కాసర్‌గోడ్‌ జిల్లా అధ్యక్షుడు మనోజ్‌ కుమార్‌(24) మృతిచెందారు. పార్టీ సీనియర్‌ నాయకుడు పి.జయరాజన్‌ అరెస్టుకు నిరసనగా…

మయన్మార్‌లలో భూకంపం

న్యూఢిల్లీ: భారీ భూకంపానికి మధ్య పెరూ వణికింది. గురువారం మధ్యాహ్నం 3.09 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు మయన్మార్‌లోనూ ఉదయం 7.51 గంటలకూ భూ ప్రకంపనలు…

భారతదేశానికి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు

న్యూఢిల్లీ: భారత్‌కు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద మన దేశంలో ఇన్ని క్రీడలకు విస్తృత ప్రాచుర్యం, ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఫలానా క్రీడ భారతజాతీయ ఆట అని…

ఒలింపిక్స్‌ లో కశ్యప్‌ ఓటమీ

లండన్‌: బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్‌ ఓటమి పాలయ్యాడు. మలేషియా క్రీడాకారుడు చాంగ్‌వీ లీ చేతిలో 19-21, 11I21 తేడాతో కశ్యప్‌ పరాజయం పొందాడు.

రైళ్లకు పవర్‌ గ్రిడ్‌ దెబ్బ

విజయవాడ: ఉత్తరాది పవర్‌గ్రిడ్‌లో లోపం కారణంగా అటునుంచి వస్తున్న పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భువనేశ్వర్‌ వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9.30కు విజయవాడ చేరుకుంది. దీంతో ప్రయాణికులు తీక్ర ఇబ్బందులు ఎరుర్కొన్నారు.

ఎవరెస్టు బృదం నగర పర్యటన

హైదరాబాద్‌: మహారాష్ట్రకు చెందిన శ్రీహరి తవ్‌కిర్‌, సాగర్‌ పాల్కర్‌, రమేశ్‌ గాలావ్‌, ఆనంద్‌ బోన్సాడ్‌, బాలాజీమనే, కుషాల్‌ దేశ్‌ముఖ్‌లు ఈ బృందంలో పాల్గొనగా వీరిలో నలుగురు హైదరాబాద్‌ను సందర్శించారు. నగరానికి చెందిన శేఖర్‌బాబుకు చెందిన పర్యాటక సంస్థ పర్యవేక్షణలో…