Wednesday, 4 November 2026

ఎవరెస్టు బృదం నగర పర్యటన

హైదరాబాద్‌: మహారాష్ట్రకు చెందిన శ్రీహరి తవ్‌కిర్‌, సాగర్‌ పాల్కర్‌, రమేశ్‌ గాలావ్‌, ఆనంద్‌ బోన్సాడ్‌, బాలాజీమనే, కుషాల్‌ దేశ్‌ముఖ్‌లు ఈ బృందంలో పాల్గొనగా వీరిలో నలుగురు హైదరాబాద్‌ను సందర్శించారు. నగరానికి చెందిన శేఖర్‌బాబుకు చెందిన పర్యాటక సంస్థ పర్యవేక్షణలో తన విజయయాత్ర సాగించింది. యాత్రకు కావాల్సిన సౌకర్యాలను ట్రాన్స్‌సెండ్‌ అడ్వెంచర్‌ వారికి కల్పించింది. ఎవరెస్టు యాత్ర సందర్భంగా పలు రికార్డులు నమోదు చేశామని బృందం సభ్యులు తెలిపారు. 20,669 అడుగుల ఎత్తులో సంగీత కచేరీ ఏర్పాటుచేసి జాతీయ గీతాన్ని, బాలీవుడ్‌ పాటలను ఆలపించామాన్నారు. దీనిని గిన్నీస్‌ రికార్డు కోసం పంపినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *