Sunday, 8 November 2026

వార్తలు

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. మే నెలలో అరెస్టయిన నిమ్మగడ్డ దాఖలుచేసిన మొదటి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున…

28 మృతదేహాల వెలికితీత

నెల్లూరు: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 28మంది మృత దేహాలను వెలికితీసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీరిలో 20మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. చాలావరకు మృత దేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయని…

మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

నెల్లూరు: నెల్లూరు రైలుప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ 5లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25వేల రూపాయలు పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

విద్యాశాఖ మంత్రి పార్థ సారధిని పదవినుంచి తప్పించాలి:యూటీఎఫ్‌

హైదరాబాద్‌:  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి పార్థసారధి పదవినుంచి తప్పించాలని. ఐక్క ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌ వ్యక్తం  చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, సమస్యలు పరిష్కరించాలని బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ అధికారి కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ…

రైలు దుర్ఘటన దురదృష్టకరం -హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: నెల్లూర్‌లో జరిగిన రైలు దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

రైలు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వారి వివరాలు

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిన వారితో పాటు రైలు నుంచి దూకేసిన ప్రయాణికులకు నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రితో పాటు…

ఫ్రాన్స్‌లో మన నల్లధనం రూ. 565కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: దేశంలో ఉన్న 15కోట్ల మంది బాలలు ప్రతి ఒక్కరూ 10మొక్కల చొప్పున నాటితే భారతదేశం సస్యశ్యామలంగా మారుతుందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. సెంటర్‌ ఫర్‌ ఎన్విరాస్‌మెంట్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ పర్యావరణ రక్షణ అవార్డుల…

ఇస్రో నుంచి త్వరలో కొత్త రాకెట్ల ప్రయోగం ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌

అనంతపురం: సెప్టెంబర్‌ రెండో వారంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రెండు కొత్త రాకెట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌ అందుకునేందుకు అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.పీఎస్‌ఎల్వీ-సి-21 రాకెట్‌ ద్వారా…

ఉత్తర గ్రిడ్‌లో 40శాతం విద్యుత్‌ సరఫరా చేస్తాం: సుశిల్‌కుమార్‌ షిండే

ఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా స్తంబించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న నేపథ్యంలో విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే వివరణ ఇచ్చారు. అధికలోడు కారనంగానే ఉత్తరగ్రిడ్‌లో సాంకేతికలోపం తలెత్తిందని అన్నారు. ఉత్తర గ్రిడ్‌లో…