Sunday, 8 November 2026

వార్తలు

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో అంతకు మూడు రెట్లు గృహనిర్మాణాలున్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో 30…

ఒలింపిక్స్‌: అర్హత సాధించిన గగన్‌ నారంగ్‌: బింద్రా విఫలం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారతీయ షూటర్‌ గగన్‌ నారంగ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు  అభినవ్‌ బింద్రా 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అర్హత సాధించలేకపోయాడు. ఆర్చరీలో బాంబేలా దేవి 16 వరౌండులోకి ప్రవేశించింది.

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

ఢిల్లీ: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం దుర్ఘటనపై ప్రధాన మన్మోహన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అవసరమైన సహకారం అందించవలసిందిగా రైల్వే శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమన్వయంతో…

ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కొండా మురళిపై శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక  కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కొండా మురళిపై  ఛైర్మెన్‌ అనర్హత వేటు వేశారు.

రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేసిన పట్టాభి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఇదే కేసులో సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటో తేదీకి…

నెల్లూరురైల్వే ప్రమాద బోగిలను పరీశీలించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నెల్లూరు సమీపంలో జరిగిన ప్రమాదం సంభవించిన తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్‌-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుబూతి తెలిపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైల్వే బోగిలను పరిశీలించారు. అధికారులు త్వరగా చేరుకోవటం వలన…

జోగంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు

వరంగల్‌: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం వలన దేవాదుల ఉత్తిపోతల పథకానికి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు  అధికారులు.

నెల్లూరురైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ

హైదరాబాద్‌: నెల్లూరు సమీప్లఓ జరిగిన ప్రమాదంపై విచారణకు రైల్వే సహయ మంత్రి మునియప్ప ఆదేశించాడు. భద్రత అధికారులతో చర్చించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్‌-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల…

రైలుప్రమాద మృతుల్లో 5 గురి గుర్తింపు

నెల్లూరు: ఈరోజు ఉదయం నెల్లూరు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందినవారిలో అయిదుగురిని గుర్తించారు. వీరి వివరాలు ఇలా ఉన్నాయి. జస్వని: కృష్ణాజిల్లా పెనుమలూరు శాలిని:(హైదరాబాద్‌) చిత్ర: (న్యూఢిల్లీ) రామ్‌సుధాకర్‌: (విజయవాడ) శ్రీజిత: (భోపాల్‌)

కోఝ్రార్‌ బాధితులను పర్యామర్శించిన కేంద్ర హోంమంత్రి

గౌహతి: కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ఈ రోజు అస్సాంలో కోక్రాఝార్‌ అల్లర్ల బాధితులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టరులో గౌహతి చేరుకున్న ఆయన కోక్రాఝార్‌లోని  ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో బాధితులను పరామర్శించారు. ఆమనతో పాటు…