Thursday, 5 November 2026

వార్తలు

నూతన మద్యం విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపట్టాలని వామపక్షాల నేతలు బీవీ రాఘవులు, నారాయణ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ఓaల ఇరుపార్టీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో…

కోలా అరెస్టుకు రంగం సిద్ధం

విజయవాడ: కోలా కృష్ణమోహన్‌ అరెస్టుకు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోలాపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో రెండు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన్న అరెస్టు చేసేందుకు రెండు బృందాలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాయి.

తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై మళ్లీ పోరాటం : స్వామిగౌడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్టు టీఎన్జీవో జేఏసీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన జస్టిస్‌ రాయకోటి కమిషన్‌ను…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం గ్యాంగ్‌టక్‌, పశ్చిమబెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి…

ప్రాణాలను పణంగా పెట్టి…త్రివర్ణతాకాన్ని కాపాడి…

ముంబయి:ఒక పక్క ఎర్రగా..భగభగ…మండతూ కార్యాలయం తగలబడిపొతోంది.మరోపక్క నల్లని దట్టమైన పొగ వూపిరి అడనివ్వడం లేదు.ఆ సమయంలో అక్కడున్నవారికి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడినుంచి బయటపడడమెలా అన్న ఆలోచన తప్ప మరోటి రాదు,కానీ కొందరికి వచ్చింది.ప్రాణాం సంగతి తర్వాత ముందు జాతి…

ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటి

ఢిల్లీ:  అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రణబ్‌ ముఖర్జితో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను తాజా రాజకీయా పరిణామాలను రాష్ట్రంలో పార్టీ తీరు తెన్నులపై…

గూలంనభితో కిరణ్‌ భేటి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుండి ఈ రోజు అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఆజాద్‌తో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను సీఎం ఆజాద్‌కు విన్నవిస్తున్నాడు.

ఈ ప్రభుత్వాలు గద్దెదిగితేనే ప్రజల కష్టాలు తీరతాయి

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు అంత తొందరగా తీరుతాయని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. ధరల పెరుగుదల, రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త జైల్‌ భరో కార్యక్రమంలో  భాగంగా…

ఓయూ పీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు వీసీ సత్యనారాయణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 89.19 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64.312 మంది పీజీఈసెట్‌ రాయగా 57 వేల మంది ఉత్తీర్ణత సాధించారు.

కలకత్తా హైకోర్టులో సీఎం మమతాకు చుక్కెదురు

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురయ్యింది. ప్రభుత్వం టాటా మోటార్స్‌ కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చి వేయడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమకు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవడాన్ని…