జర్నలిస్టును నిర్బంధించిన కేసులో కరీంనగర్ సీపీ బదిలీ
హైదరాబాద్ : జనంసాక్షి కరీంనగర్ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ పాత్రికేయులు పీఎస్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరఢా జులుపించింది. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత పదిరోజుల క్రితం మంత్రి గంగుల ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు.. టూటౌన్ సీఐని పురమాయించారు. ఈ మేరకు పోలీసు సిబ్బంది పీఎస్ రవీంద్ర ఇంటికివెళ్లి ఆయనను జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన విషయం విదితమే. ప్రజాసంఘాలు, పలు పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచగా.. జనంసాక్షి రాష్ట్ర బృందం కూడా ఈ నెల 18న ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… పోలీస్ కమిషనర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా పలు కారణాల రీత్యా కరీంనగర్ కలెక్టర్ గోపీని కూడా బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.