బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు

తుంగతుర్తి అక్టోబర్ 27 (జనం సాక్షి)
తుంగతుర్తి నియోజకవర్గం లోని మద్దిరాల తుంగతుర్తి మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు .ఈ మేరకు నూతనకల్లు మండలంలోని కొత్త తండా భాగ్య తండా .దిర్షణ పల్లి తండా. బిక్కు మల్ల గ్రామాలతో పాటు తుంగతుర్తి మండలం లోని వెంపటి తుంగతుర్తి . పసునూరు తో పాటు పలు గ్రామాల్లో అధికారకంగా బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం అమ్ముతున్నారని విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు దాడి చేసి వారి నుండి 50 కేజీల బెల్లం 500 బెల్లం పానకాన్ని తో పాటు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అక్రమ మద్యాన్ని కలిగి ఉన్న ముగ్గురిని నూతనకల్ తాసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్. ఎస్సై గణేష్. మూర్తి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు