దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలె: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం గోరికొత్తపల్లి మండలంలోని విజ్జయ్యపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.బడింది. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ దేవతల అనుగ్రహం, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. గ్రామంలో శాంతి, సుఖసంతోషాలు, ఐకమత్యం నెలకొని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.