మా అభ్యర్థుల మార్పు ఉండదేమో : కేటీఆర్‌

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మార్పు బహుశా ఉండకపోవచ్చునని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులు 114 మంది ప్రచారంలో దూసుకుపోతున్నారని వెల్లడిరచారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులే లేరు.. అలాంటప్పుడు 70 చోట్ల ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో డబ్బులిచ్చిన వారికే టికెట్లు వస్తున్నాయని, ఇటీవల కూకట్‌పల్లి సీటు కోసం 15 కోట్లు అడిగినట్టు ఒకాయన చెప్పారని కేటీఆర్‌ అన్నారు.