ఎస్‌బీఐ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలి
సూర్యాపేట (జనంసాక్షి):ఎస్‌బీఐ ఉద్యోగుల 16 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రీజినల్ సెక్రటరీ అయితగొని మహేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్‌బీఐ
సూర్యాపేట రీజియన్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గత మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు చేపట్టాలని, ఆర్మ్ డ్ గార్డుల నియామకం,ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.అవుట్ సోర్సింగ్ విధానాన్ని నిలిపివేసి తగిన సిబ్బందిని నియమించాలని అన్నారు.పెన్షన్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, హెచ్ఆర్ఎంఎస్ సమస్యలు, ఉద్యోగుల బదిలీలు, కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ వంటి అంశాలపై కూడా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు.మే 25, 26వ తేదీలలో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీలు సురేష్, హేమలత, నవీన్, క్రాంతి, కిషోర్, ప్రియాంక, చందు, కిరణ్, నవ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.



