నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 27,జనం సాక్షి:నల్లగొండ జిల్లాలోని పానగల్ ఫ్లైఓవర్‌పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నిలిచివున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో,కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి సందీప్ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో పానగల్ ఫ్లైఓవర్‌పై ముందుగా నిలిపి ఉన్న లారీని అతను నడుపుతున్న కారు బలంగా ఢీకొట్టింది.ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, సందీప్ కారులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న వెంటనే టూ టౌన్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీఐ రాఘవ రావు, ఎస్ఐ సైదులు స్వయంగా పర్యవేక్షణలో కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకు తీసి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు నల్లగొండకు బయల్దేరినట్లు తెలిసింది.అతి వేగం కారణమా, లేక నిర్లక్ష్యంగా నిలిపిన లారీ కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పానగల్ ఫ్లైఓవర్‌పై విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి




