రూపాయి పతనానికి మోదీయే కారణం

share on facebook

– నోట్ల రద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది
– ప్రజల బతుకుల్లో మార్పురావాలంటే బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యం
– సీపీఎం నేత బీవీ రాఘవులు
హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రూపాయి పతనానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపలంలో సీపీఎం రాష్ట్ర కమిటీ ప్లీనరీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ.. నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందలేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. 2019 ఎన్నికల్లో భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ హావిూని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొందని.. ప్రజల బతుకులు మారాలంటే బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రావాలని రాఘవులు అన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో పేద ప్రజలకు చేసింది ఏవిూలేదన్నారు. రైతుబంధు పథకంలో పెద్దరైతులకు మేలు చేసి చిన్న రైతులకు తీవ్రంగా అన్నాయం చేశారన్నారు. కౌలు రైతులు రాష్ట్రంలో అధికమంది ఉన్నారని, వారికి రైతుబంధు పథకం వర్తింప చేయకుండా వారిని వ్యవసాయానికి దూరం చేసేలా కేసీఆర్‌ పూనుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలోనూఅ వినీతిప ఎరిగిపోయిందన్నారు. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడి బీఎల్‌ఎఫ్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఆమేరకు ప్రతి ఒక్కరూ బీఎల్‌ఎఫ్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Other News

Comments are closed.