ఆటో బోల్తా పడి ఒకరి మృతి

కర్నూలు : ఎమ్మిగనూరు డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తాజావార్తలు